డబుల్ వసూల్ చేస్తున్న నాని

0స్టార్ మా లో వచ్చని బిగ్ బాస్-1 రియాలిటీ షోకు ఎన్టీఆర్ తన హోస్టింగ్ తో ఆ షోకు స్పెషల్ అసెట్ గా నిలిచాడు. ఈ సెకండ్ సీజన్ కు ఎన్టీఆర్ ఖాళీగా లేకపోవడంతో ఆ ప్లేస్ లోకి నాచురల్ స్టార్ నాని వచ్చాడు. మరికొద్ది రోజుల్లో ఆ షో స్టార్ట్ కానుంది. ఈసారి ఇంకొంచెం మసాలా అంటూ ప్రోమోలతో నాని బాగానే ఆకట్టుకుంటున్నాడు.

శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో హీరో నాగార్జునతో కలిసి నాని మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా ఇదొక్కటే. ఇందులో ఇద్దరు హీరోలున్నా రెమ్యునరేషన్ విషయంలో నాగార్జున కన్నా నానికే ఎక్కువ దక్కిందని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు నాగ్ కు రూ. 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ దక్కగా.. నానికి అంతకు రెట్టింపు మొత్తం దక్కిందని ఆ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలో నాగ్ పాత్రం కన్నా నాని పాత్రే పెద్దదని.. స్క్రీన్ టైం కూడా అతడికే ఎక్కువ ఉంటుందని అంటున్నారు. ఈ కారణం వల్లే నాగార్జున కన్నా నానికి ఎక్కువ మొత్తం అందిందని చెప్పుకొచ్చారు.

వరస హిట్లతో మంచి జోష్ మీదున్న నానికి లేటెస్ట్ సినిమా కృష్ణార్జున యుద్ధం బ్రేకులేసింది. డబుల్ యాక్షన్ తో మెప్పిస్తాడనుకున్న నాని ప్రేక్షకులను నీరసపరిచాడు. దీంతో ఇప్పుడు ఫుల్ ఫోకస్ మల్టీ స్టారర్ మూవీమీదే పెట్టాడు. ఇదికాక మిగిలిన కాల్షీట్లలో ఎక్కువ బిగ్ బాస్-2 కోసమే కేటాయించాడు. ఈ షో అయ్యేవరకు కొత్త సినిమా ఊసేమీ ఉండకపోవచ్చు.