అంతా నాది కాదంటున్న నాని!!

0

మొన్న శుక్రవారం విడుదలైన దేవదాస్ మిక్స్ డ్ టాక్ తో పడుతూ లేస్తూ వసూళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అరుదైన కాంబినేషన్ పూర్తిగా సద్వినియోగపర్చుకోవడంలో విఫలమైన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య వైపే అందరూ వేలెత్తి చూపుతున్నారు. అయినా కూడా ఇద్దరి హీరోల అభిమానులతో పాటు కొన్ని వర్గాల ప్రేక్షకులకు దేవదాస్ ఓ మోస్తరుగా నచ్చాడు కాబట్టి ఈ మాత్రం వసూళ్లయినా దక్కుతున్నాయి. ఇక టైమింగ్ పరంగా చూసుకున్నా ఎంటర్ టైన్ మెంట్ పరంగా చూసుకున్నా నాని రోల్ బెటరన్న అభిప్రాయం సినిమా చూసిన వాళ్లలో అధికశాతం ఫీలయ్యారు.

దేశమంతా గడగడలాడిపోయే డాన్ దేవా పాత్రను తీర్చిదిద్దిన తీరు కన్నా తెలిసి తెలియని అమాయకత్వంతో పేషేంట్ల ఆరోగ్యం కోసం పాటు పడే డాక్టర్ దాస్ గా నానికే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. అందుకే నిన్న డిలీటెడ్ సీన్ పేరుతో ఓ మూడు నిమిషాల సీన్ ని విడుదల చేస్తే అందులో రావు రమేష్ దగ్గర నాని నట విశ్వరూపాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ సన్నివేశం ఉంటేనే బాగుండేదన్న అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తమయ్యింది.

అదలా ఉంచితే నాని మాత్రం ఈ విషయాన్నీ ఒప్పుకోవడం లేదు. విడులయ్యాక పాల్గొన్న ఓ ప్రమోషన్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ పూర్తి క్రెడిట్ తనతో కలిసి నటించిన నాగార్జున గారికి దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు హీరోయిన్లు రష్మిక ఆకాంక్షలకు చెందుతుందని వాళ్ళకు ఇచ్చేసాడు. తాను అందులో ఒక భాగం మాత్రమే వహించానని అంతే తప్ప తనవల్ల సినిమాకు గొప్ప ప్రయోజనం కలగలేదని అందరి సమిష్టి కృషి వల్లే సినిమా ఇంతబాగా వచ్చిందని చెప్పాడు.నాని వరకు నిజాయితీగానే ఉన్నాడు. ఫలితం పూర్తి పాజిటివ్ గా ఉంటే బాగుండేది కానీ ఆ ఛాన్స్ మిస్ అయినట్టే.

త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న జెర్సీ కోసం సీరియస్ గా క్రికెట్ ని ప్రాక్టీస్ చేస్తున్న నాని అందులో బ్యాట్ మెన్ గా కనిపిస్తాడట. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో గతంలో నాని భీమిలి కబడ్డీ జట్టు చేసాడు.ట్రాజెడీ క్లైమాక్స్ వల్ల ఈ రీమేక్ సినిమాను మన ప్రేక్షకులు పూర్తి స్థాయిలో రిసీవ్ చేసుకోలేకపోయారు. కానీ జెర్సీలో ఆ సమస్య లేదు. చాలా వైవిధ్యంగా ఉండే కథతో మెప్పిస్తాను అని గ్యారెంటీగా చెబుతున్న నాని జెర్సీతో కలుసుకునేది వచ్చే సంవత్సరమే.
Please Read Disclaimer