నాని లాజిక్ రివర్స్ అయ్యింది..

0వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్న నాని కి బ్రేక్ పడింది. కృష్ణార్జున యుద్ధం చిత్రం నానికి పెద్ద షాకే ఇచ్చింది. ఈ మూవీ లో నాని ద్విపాత్రాభినయం చేసాడు. కానీ ఈ మూవీ కథ పెద్దగా లేకపోవడం తో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే సినిమా ప్రమోషన్ లలో నాని తెలిపిన లాజిక్ ను ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.

రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ కావడం తో, మా సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని నాని తెలిపాడు.. కానీ ఇప్పుడు ఆయన లాజిక్ రివర్స్ అయ్యింది. పక్కన సూపర్ హిట్ టాక్ తో ఓ సినిమా దూసుకపోతున్నప్పుడు , బాగాలేని సినిమా చూడడం ఎందుకని ఈ సినిమా వైపు జనాలు చూడడం లేదట. మరోపక్క రంగస్థలం మాత్రం ఇంకా హావ కొనసాగిస్తూనే ఉంది. మూడో వారం లోను హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. చాలామంది ఒకటికి రెండు సార్లు ఈ మూవీ చూస్తున్నారట. దీంతో కృష్ణార్జున యుద్ధం కలెక్షన్స్ బాగా డ్రాప్ అయినట్లు సమాచారం.