నాని.. ఓటు విక్రమ్ కే

0nani-awe-speechనాని మంచి జోరుమీద వున్నాడు. ఆయన ఏ సినిమా చేసినా హిట్టే. వరుసగా ఆయన విజయాలు చూసి దర్శకులు సైతం ఆయనకోసం స్పెషల్ కధలు రాసుకుంటున్నారు. నాని కోసం క్యూ క‌ట్టే ద‌ర్శ‌కుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్ర‌స్తుతం కృష్ఱార్జున‌యుద్దం సినిమాతో బిజీగా ఉన్నాడు నాని.

ఆ త‌ర‌వాత నాగార్జున‌తో మ‌ల్టీస్టార‌ర్ మొద‌ల‌వుతుంది. ఈలోగా విక్ర‌మ్ కె.కుమార్ క‌థ‌కి ఓకేచెప్పాడు. మ‌రోవైపు కిషోర్ తిరుమ‌ల తోనూ జ‌ట్టు క‌ట్ట‌డానికి రెడీ అయ్యాడు. అయితే.. నాగ్‌తో మ‌ల్టీస్టార‌ర్ త‌ర‌వాత ఎవ‌రి సినిమాని ప‌ట్టాలెక్కించాలా?? అని ఆలోచిస్తున్నాడు. అయితే నాని మాత్రం.. ముందుగా విక్ర‌మ్ కె.కుమార్ సినిమాకే కాల్షీట్లు ఇవ్వాల‌ని డిసైడ్ అయిన‌ట్టు టాక్‌. దీనికి కారణం వుంది. విక్రమ్ కొంచెం బిజీ. ఆయన డేట్స్ కూడా చాలా కష్టం. నాని కోసం కొన్ని రోజులు ఇప్పటికే కేటాయించాడు విక్రమ్. అందుకే ముందు విక్రమ్ తో సినిమా ఫినిష్ చేసేయాలనే ఆలోచనలో వున్నాడు నాని.