నాగార్జున ప్లేస్ కొట్టేసిన విజయ్ దేవరకొండ

0vijay-devarakondaకలెక్షన్స్ పెద్దగా రాకపోయినా క్రిటిక్స్ ను మెప్పించడంలో సక్సెస్ అందుకుంది నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి ఫేమ్ విజయదేవరకొండ కూడా నటించాడు కానీ ఆ సినిమా విడుదల టైమ్ కి విజయ్ కి పెద్దగా పాపులారిటీ లేదు. దీంతో సినిమాలో సెకండ్ హీరో రేంజ్ అయినప్పటికీ కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే విజయ్ ను పరిగిణించాల్సి వచ్చింది. అయితే ఎవడే సుబ్రహ్మణ్యం తరువాత నాని కెరీర్ గ్రాఫ్ కూడా ఓ రేంజ్ కి వెళ్లిపోయింది. అలానే విజయ్ కూడా ఇప్పుడు హీరోగా ఓ స్టాండ్ తెచ్చేసుకున్నాడు. ప్రస్తుతం వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్న వీరిద్దరు త్వరలోనే మళ్లీ కలిసి నటిస్తారనే న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో షికార్లు చేస్తుంది. నిజానికి ఎవడే సుబ్రహ్మణ్యం తరువాత వైజయంతి మూవీస్ బ్యానర్ లో నాని ఓ సినిమా కమిట్ అయ్యాడు కానీ పలు కారాణల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అందులో కింగ్ నాగార్జున్ కూడా నటిస్తాడనే వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకు కార్య రూపం దాల్చని ఈ ప్రాజెక్ట్ కి త్వరలోనే సెట్స్ పైకి రాబోతుందని ఓ యువ దర్శకుడు ఈ మల్టీస్టారర్ ని తెరకెక్కిస్తాడనే టాక్ నడుస్తుంది.

అంతేకాదు నాగార్జున బిజీగా ఉండటంతో ఆయన స్థానంలోకి విజయదేవరకొండను తీసుకునేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయిన విజయ్ కి ఈ మల్టీస్టారర్ ఓ బంపర్ ఆఫర్ అని సినీ జనాలు అంటున్నారు. మరి నాగార్జునతో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన నాని ఇప్పుడు విజయ్ తో కలిసి నటించేందుకు ఒప్పుకుంటాడో లేదో చూడాలి. ఒకవేళ ఒప్పకుంటే ఎవడే సుబ్రహ్మణ్యం కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయినట్లే. చూద్దాం ఏం జరుగుతుందో