అన్నదమ్ములుగా నాని – నాగ్

0టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో క్రేజీ మల్టీస్టారర్ రాబోతుంది..కింగ్ నాగార్జున , నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని , రామోజీ ఫిలిం సిటీ లో రెండో షెడ్యూల్ మొదలు పెట్టింది.

అయితే ఈ మూవీ లో నాగార్జున , నాని అన్నదమ్ములుగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్నీ స్వయం గా నాని నే తెలిపాడు. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం నాని నటించిన కృష్ణార్జున యుద్ధం మూవీ ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మేర్లపాక గాంధీ ఈ మూవీ ని డైరెక్ట్ చేసాడు.