ఇదే లాస్ట్.. నాని మాటలకు అర్థం ఏంటీ?

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 పూర్తి అయ్యింది. నాని హోస్ట్గా వ్యవహరించిన ఈ సీజన్ విజేతగా కౌశల్ నిలిచాడు. ఈ సీజన్ మొత్తం కూడా కౌశల్ ఆర్మీ హవా కొసాగినట్లుగా క్లీయర్ గా తెలుస్తోంది. కౌశల్ ను టార్గెట్ చేసి నాని వ్యాఖ్యలు చేసిన ప్రతి సారి కూడా కౌశల్ ఆర్మీ తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేసిన విషయం తెల్సిందే. దాంతో పలు సందర్బాల్లో నాని నొచ్చుకున్నాడు. ఒకానొక సమయంలో నాని సుదీర్ఘమైన వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

చివరి కొన్ని వారాల్లో అసు కౌశల్ ను పట్టించుకోకుండా – కౌశల్ గురించి కామెంట్ చేయకుండా సేఫ్ గా హోస్టింగ్ చేస్తూ వచ్చాడు. నానిని కౌశల్ ఆర్మీ బాగా ఇబ్బంది పెట్టినట్లుగా గతంలో పలు సార్లు ఆయన మాటల ద్వారా వెళ్లడి అయ్యింది. మూడున్నర నెలలుగా ప్రశాంతత లేకుండా ఉందని దేవదాస్ ప్రమోషన్ సందర్బంగా నాని ఒకింత అసహనంతో మాట్లాడటం అందరికి తెల్సిందే. ఇక తాజాగా ఫైనల్ ఎపిసోడ్ సందర్బంగా నాని మాట్లాడిన మాటలు సీజన్ 3 కి కొత్త హోస్ట్ ఖాయం అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

నిన్నటి ఎపిసోడ్ లో నాని మాట్లాడుతూ.. ఈరోజు ఫైనల్ – బిగ్ బాస్ హోస్ట్ గా ఇదే నాకు చివరి రోజు అంటూ మాట్లాడటంతో సీజన్ 3 పై నాని ఆసక్తిగా లేడని తేలిపోయింది. బిగ్ బాస్ తనకు గొప్ప అనుభూతిని మిగిల్చిందని ప్రకటించిన నాని తనను ఆధరించిన వారికి కృతజ్ఞతలు చెప్పాడు. హోస్ట్ గా నన్ను అభిమానించిన వారికి కృతజ్ఞతలు చెప్పిన నాని – హోస్ట్ గా తనను ఇష్టపడని వాళ్లకు థియేటర్ లో కలుద్దామని చెప్పాడు. మొత్తానికి సీజన్ 3కి నాని హోస్టింగ్ చేయడనే విషయం దాదాపు ఖాయం అంటూ ప్రేక్షకులు విశ్లేషిస్తున్నారు.
Please Read Disclaimer