`గూఢచారి`కి నాని సెంటిమెంట్ వర్కవుటవుద్దా?

0టాలీవుడ్ లో హీరో హీరోయిన్లకు…దర్శక నిర్మాతలకు కొన్ని సెంటిమెంట్లుంటాయి. దసరా – సంక్రాంతి…కొన్ని ప్రత్యేక మైన డేట్స్….లక్కీహ్యాండ్స్…ఇలా చాలా రకాల సెంటిమెంట్స్ ను వారు ఫాలో అవుతుంటారు. అయితే ప్రస్తుతం తాను ట్రైలర్ రిలీజ్ చేసిన సినిమాకు అదే తరహా సెంటిమెంట్ వర్కవుట్ కావాలని న్యాచురల్ స్టార్ నాని కోరుకుంటున్నాడు. గతంలో తాను ట్రైలర్ రిలీజ్ చేసిన `అర్జున్ రెడ్డి` పెద్ద హిట్ అయిందని…అలాగే `గూఢచారి `కూడా పెద్ద హిట్ కావాలని నాని ఆకాంక్షించాడు. ఇప్పటికే నాని రిలీజ్ చేసిన గూఢచారి ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. క్షణంతో హిట్ కొట్టిన అడివి శేష్…మరో హిట్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది.

గూఢచారి కథాంశం నేపథ్యంలో ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దగా సినిమాలేమీ రాలేదు. మహేష్ `స్పైడర్ `తెలుగులో ఆకట్టుకోలేకపోయింది. దీంతో `గూఢచారి`పై శేష్ ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే గూఢచారి మూవీ ట్రయిలర్ ఆకట్టుకుంటోంది. పైగా నాని సెంటిమెంట్ గా చెప్పిన మాటలు పాజిటివ్ గా వర్కవుట్ అయ్యేలా ఉంది. దానికితోడు తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ల ….హాట్ గా నటించడం ఈ సినిమాకు ప్లస్ కావచ్చు. హీరో నాగార్జున మేనకోడలు… సుప్రియ కీలకపాత్ర పోషించింది. కొత్త డైరెక్టర్ శశి కిరణ్ తిక్క గూఢచారి మూవీకి దర్శకత్వం వహించాడు. అయితే సెంటిమెంట్ లు అన్ని సార్లు వర్కవుట్ కావాలని రూల్ ఏం లేదు. కంటెంట్ ఉంటేనే కాసులు రాలతాయని టాలీవుడ్ లో చాలా సార్లు ప్రూవ్ అయింది. మరి సెంటిమెంట్ లను అధిగమించి అడివి శేష్ మరో హిట్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.