నానీ.. మళ్లీ నోరు జారాడు!

0Nani-New-Movieనాచురల్ స్టార్ గా ఉన్న పేరును.. అప్పుడప్పుడూ నోరు జారుతూ పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు.. నాని. గతంలో.. రాశీఖన్నా హిప్స్ చూస్తే ఈల వేయాలనిపిస్తుంది అంటూ కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఇప్పుడు మళ్లీ నాని.. అలాంటి అడల్ట్ జోకు వెశాడు. మరకతమణి సినిమాలో నటించిన తన స్నేహితుడు ఆది పినిశెట్టి కోసం.. ఆ సినిమా ఆడియో విడుదలకు హాజరయ్యారు. ఈ సినిమా గురించిన డిస్కషన్ లో భాగంగా.. ఆదితో మాట్లాడుతూ.. హీరోయిన్ నిక్కీ గాల్రానీ గురించి నోరు జారేశాడు.

“తనని పెళ్లి చేసుకోవచ్చు కద బాబాయ్.. బాగుంది గా” అంటూ అదో రకమైన ఎక్స్ ప్రెషన్ తో.. అందరి ముందే.. ఓపెన్ గా నాని కామెంట్ చేసేసరికి అంతా షాక్ అయ్యారు. అప్పటికప్పుడు కాస్త సరదాగా నవ్విన ఆది పినిశెట్టికి కూడా.. నాని ఇంటెన్షన్ ఏంటో సరిగా అర్థం కాని పరిస్థితి ఎదురైనట్టే కనిపించింది. ఇలాంటివి పర్సనల్ డిస్కషన్ లో అయితే బాగుంటాయి కానీ.. అందరి ముందే ఇలా అనేస్తే ఎలా అని.. నాని తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.