సాయిపల్లవితో బైక్‌ పై నాని షికార్లు

0nani-saipallavi-mca-movieవరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న న్యాచురల్‌ స్టార్‌ నాని తన బైక్‌ పై ఓ అమ్మాయిని కూర్చొబెట్టుకొని హన్మకొండ రోడ్లపై షికార్లు చేస్తు‍న్నాడు. ఇది నిజంగా నిజం అయితే నాని ఏదో సరదాకి అలా రోడ్ల మీద తిరిగేయటం లేదు.. ప్రస్తుతం నాని, వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంసీఏ(మిడిల్‌క్లాస్‌ అబ్బాయి) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

షూటింగ్ లో భాగంగా ఓ సన్నివేశం కోసం ఇలా బైక్ పై చక్కర్లు కొడుతున్నారు ఈ స్టార్స్. షూటింగ్‌లో భాగంగా బుధవారం ఉదయం హన్మకొండ గ్రీన్‌ స్క్వేర్‌ ప్లాజా సమీపంలో వీరిద్దరు బైక్‌ పై వెళ్తుండటంతో స్థానికులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. ఇటీవల నిన్నుకోరి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని, ఎంసీఏతో పాటు కృష్ణార్జున యుద్ధం సినిమాలో కూడా నటిస్తున్నాడు.