‘ బిగ్ బాస్ ‘ సీజన్ 2 హోస్ట్ గా నాని..?

0యాంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారి బిగ్ బాస్ షో ద్వారా బుల్లితెర ఫై హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడం , మొదటిసారి తెలుగు టెలివిజన్ రంగం లో ఇలాంటి వినూత్న షో రావడం తో ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. అత్యధిక టిఆర్పి రేటింగ్ సాధించి ఈ షో సక్సెస్ సాధించింది.

తాజాగా ‘బిగ్ బాస్’ సీజన్ 2 ను ప్రారంభించాలని నిర్వాకులు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సీజన్ 2 కు హోస్ట్ గా ఎన్టీఆర్ చేయడం లేదని తెలుస్తుంది. ఆ ప్లేస్ ను వరుస సక్సెస్ లతో జోరు మీద ఉన్న నాని కైవసం చేసుకోబోతున్నాడని సమాచారం. ముందుగా ఎన్టీఆర్ ను అనుకున్నప్పటికీ ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలు కమిట్ అయి ఉండడం తో ఈ షో కు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నాడట. దీంతో పలువురు హీరోలను అనుకున్నప్పటికీ వారిలో నాని అయితే బెస్ట్ అని నిర్వాకులు ఫిక్స్ అయ్యారని సమాచారం.
త్వరలోనే ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించబోతారని అంటున్నారు. మరి ఈ మాటలే నిజమైతే గతంలో రేడియో జాకీగా పనిచేసిన నాని ఈ రియాలిటీ షోను ఏ స్థాయిలో రక్తికట్టిస్తాడనే చూడాలి.