నాపేరు సూర్య ఫస్ట్‌ ఇంపాక్ట్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానం

0‘చచ్చిపోతా గాడ్‌ఫాదర్‌.. కానీ ఇక్కడ కాదు, బోర్డర్‌కు వెళ్లి చచ్చిపోతాను’ అంటూ విడుదలైన ‘నాపేరు సూర్య నాఇల్లు ఇండియా’ ఫస్ట్‌ ఇంపాక్ట్‌కు విశేషమైన స్పందన లభించింది. సోమవారం సాయంత్రం విడుదలైన ఈ వీడియోను యూట్యూబ్‌లో మొత్తం 60 లక్షల మందికిపైగా వీక్షించారు. ఇప్పటికీ ఇది యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. 1,62,076 మంది ఫస్ట్‌ ఇంపాక్ట్‌ నచ్చిందని లైక్‌ చేశారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ ప్రచార చిత్రానికి యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌తో కలిసి మొత్తం 10 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. కేవలం 29 గంటల్లో ఈ ఘనత సాధించినట్లు తెలిపారు. దీనికి కారణమైన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు.

వక్కంతం వంశీ ‘నాపేరు సూర్య నాఇల్లు ఇండియా’కు దర్శకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై నాగేంద్రబాబు, శ్రీధర్‌ లగడపాటి నిర్మిస్తున్నారు. విశాల్‌-శేఖర్‌ బాణీలు అందిస్తున్నారు. అర్జున్‌, బ్రహ్మానందం, శరత్‌కుమార్‌, ఠాకూర్‌ అనూప్‌ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.