నారా వారి ఆటగాడు

0నారా రోహిత్ సినిమాలు ఇలా ఉంటాయంటూ జనాల దగ్గర ఓ క్లారిటీ ఉంది. అంతగా తన ఇమేజ్ ను నిర్మించుకున్నాడు ఈ నారా కుర్రాడు. వెరైటీ కోసం అని చెప్పి ఈ మధ్యన రొటీన్ సినిమాలు చేసి ఫ్లాప్స్ ఎదుర్కొన్నాడు కానీ.. ప్రస్తుతం ఇతడి ఖాతాలో చాలానే విభిన్నమైన సినిమాలు ఉన్నాయి.

దాదాపు అరడజన్ సినిమాలను క్యూలో పెట్టేసిన నారా రోహిత్.. వీటిలో ఒక చిత్రాన్ని రిలీజ్ కి సిద్ధం చేసేశాడు కూడా. ఆటగాళ్లు అంటూ జగపతి బాబుతో కలిసి ఓ విభిన్నమైన చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు నారా రోహిత్. ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలానే ఆసక్తిని కలిగించగా.. ఈ మూవీ షూటింగ్ కు ఇప్పటికే గుమ్మడికాయ కొట్టేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూలై 5వ తేదీన ఆటగాళ్లు మూవీని విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట.

పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని.. యాక్షన్ ఎంటర్టెయినర్ జోనర్ లో రూపొందించారని తెలుస్తోంది. ఫిలిం డైరెక్టర్ పాత్రలో నారా కుర్రాడు కనిపిస్తాడట. త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి.. భారీగానే ప్రమోట్ చేయనున్నారట. జగపతి బాబు.. నారా రోహిత్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని.. సినిమాకు ఈ సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయని అంటున్నారు.