‘భీముడు’ గా రాబోతున్న నారా రోహిత్

0Nara-Rohitజయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుపోతున్నాడు నారా రోహిత్. రీసెంట్ గా ‘శమంతకమణి’ సినిమాతో అలరించిన రోహిత్ ‘కథలో రాజకుమారి’ మరియు ‘బాలకృష్ణుడు’ చిత్రాలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా వున్నాడు.

ఇప్పుడు మరో సినిమాకు పచ్చజెండా ఊపాడు. గతంలో తనతో ‘సావిత్రి’ సినిమా చేసిన పవన్ సాదినేని దర్శకత్వంలో మరోసారి చేయబోతున్నాడట రోహిత్. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా టైటిల్ ‘భీముడు’గా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇదో హర్రర్ కథతో తెరకేక్కబోతుందని, ఇందులో భయపెట్టే భీముడుగా రోహిత్ నటిస్తాడని ఫిలిం నగర్ టాక్.

భీముడు పాత్ర కాస్త బలంగా వుండాలి కాబట్టి, దానికి తగినట్టుగా శరీరాన్ని మలుచుకుంటున్నాడని, ఇప్పటికే ‘బాలకృష్ణుడు’ కోసం సిక్స్ ప్యాక్ చేస్తున్న రోహిత్ ఈ సినిమాలో అదే ఫిజిక్ ను కంటిన్యూ చేస్తాడని సమాచారం. ఈ మధ్య హర్రర్ సినిమాలు ఆకట్టుకుంటుండడంతో ఆ జోనర్ సినిమాలు చేయడానికి హీరోలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.