ఫస్ట్ లుక్:రో`హిట్ మ్యాన్` కల్ట్ అవతారం

0ఇంటెన్సిటీతో కూడిన పాత్రల్లో ఒదిగిపోవాలంటే నారా రోహిత్ పేరే చెప్పాలి. ఆయనకి తొలి సినిమా `బాణం` నుంచే అది అలవాటైంది. ఆ చిత్రంలోనే అనుభవమున్న కథానాయకుడిలా నటించి అదరగొట్టాడు. ఆ తర్వాత కూడా ఆయన `రౌడీ ఫెలో` – `అసుర`- `అప్పట్లో ఒకడుండేవాడు` తదితర చిత్రాల్లో ఇంటెన్సిటీతో కూడిన పలు పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించాడు. తాజాగా మరోసారి ఆయనకి ఆ తరహా కథ దొరికింది. అదే… `వీర భోగ వసంతరాయలు`. కల్ట్ ఈజ్ రైజింగ్ అనే క్యాప్షన్ తో రూపొందుతున్న ఈ సినిమాని ఇంద్రసేన.ఆర్ తెరకెక్కిస్తున్నారు.

సుధీర్బాబు – శ్రియ – శ్రీవిష్ణు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. క్యాప్షన్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలోని లుక్స్ కల్ట్ అవతారంలో బయటికొస్తున్నాయి. ఈ రోజు నారా రోహిత్ పుట్టినరోజు. ఆ సందర్భంగా వీరభోగ వసంతరాయలు లుక్ ని విడుదల చేశారు. అందులో నారా రోహిత్ చూపులు మరింత ఇంటెన్స్ ని రేకెత్తించేలా ఉన్నాయి. ఒకప్పుడు వరుస విజయాలతో అదరగొట్టిన హీరో కాబట్టి రోహిట్ మ్యాన్ అంటూ చిత్రబృందం శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ ని రిలీజ్ చేసింది.