బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లాభం లేదే!

0

రెండు పెద్ద కుటుంబాల అండ ఉన్న హీరో పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతున్నా ఇంకా కుదురుకుపోవడం అంటే చిన్న విషయం కాదు. ఓ ఐదో పదో సినిమాలు చేసి ఏదీ ఆడక కనుమరుగైపోవడం అంటే అది మాములే అనుకోవచ్చు. తారకరత్న ఇలాగే హడావిడి చేసి చివరికి క్యామియోలకు వచ్చేసాడు. అవీ ఫలితాన్ని ఇవ్వడం లేదు. అది వేరే సంగతి. కానీ నారా రోహిత్ కేసు వేరు. బాణం లాంటి విభిన్నమైన చిత్రంతో పరిచయమై సోలోతో చెప్పుకోదగ్గ హిట్ నే సాధించినా ఆ తర్వాత మాత్రం రౌడీ ఫెలో లాంటి ఒకటి అరా తప్పితే కుర్రాడు హిట్టు మొహం చూస్తే ఒట్టు. ఒక పక్క రక్త సంబంధం ఉన్న నారా కుటుంబం మరోపక్క దాంతోనే బంధం ఏర్పడిన నందమూరి ఫ్యామిలీ. ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందీ అంటే ఈపాటికే సెటిల్ అయిపోయి ఉండాలి. కానీ జరుగుతోంది వేరు.

నారా రోహిత్ హీరోగా ఒక సినిమా వస్తోంది కనీసం పావు వంతు ధియేటర్ నిండేంత ఓపెనింగ్స్ రావడం లేదు. సరే ఒంటరిగా చూడటం లేదు కదా అని ఇతర హీరోలతో కలిసి చేస్తున్నా ఫలితం మాత్రం మారడం లేదు. ఇప్పటికే పాతిక సినిమాలకు దగ్గరలో ఉన్న నారా రోహిత్ కెరీర్ మొత్తం హిట్స్ ఎన్ని అంటే లెక్కబెట్టడానికి ఒక చేతి వేళ్ళు కూడా ఎక్కువే. ఇంత నిరాశాజనకంగా కెరీర్ ఉంది . విభిన్నమైన కథల పేరుతో రోహిత్ చేస్తున్న విచిత్ర ప్రయోగాలు అతన్నే కాదు నమ్ముకుని తీస్తున్న నిర్మాతలను దెబ్బ తీస్తున్నాయి . ముగ్గురేసి హీరోలు ఉన్నా వీర భోగవసంత రాయలుకి ఏ మాత్రం బజ్ లేకపోవడానికి కారణం ఇదే అని చెప్పాలి. నారా రోహిత్ సమస్య కథ ఎంపిక మాత్రమే కాదు. ఏ సినిమా చూసినా గెడ్డంతో సహా ఒకేరకమైన హావభావాలతో రొటీన్ గా మారిపోవడం ఇవన్నీ మార్కెట్ ని అంతకంతా తగ్గించేస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వేడుకలకు సైతం రాని బాలయ్య క్రమం తప్పకుండా నారా రోహిత్ వేడుకలకు చాలా సార్లు వచ్చాడు. సావిత్రి-రాజా చెయ్యి వేస్తే ఫంక్షన్లకు బాలయ్య చీఫ్ గెస్ట్. అయినా కూడా నందమూరి అభిమానులు అండ ఉన్నా నిలవలేకపోయాడు. ఇలా చేవలేని కథలతో పాతిక కాదు యాభై అయినా పూర్తి చేయడం పెద్ద విషయం కాదు కానీ హీరోగా తన పొజిషన్ ఏంటి తనకున్న గుర్తింపు ఏంటి అని నారా రోహిత్ ఓసారి విశ్లేషించుకుని రీ ప్లాన్ చేసుకుంటే బెటర్. లేదంటే ఖాళీ థియేటర్ల దాకా ఏదోలా వస్తున్న అతని సినిమాలు ల్యాబులకే పరిమితమయ్యే ప్రమాదం దగ్గర్లో ఉంది.
Please Read Disclaimer