మెగాబ్రదర్ ను దూషించడం తప్పు!- నరేష్

0

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల వేళ దూషణల ఫర్వ ం- హైడ్రామా గురించి తెలిసిందే. శివాజీరాజా ప్యానెల్ .. సీనియర్ నరేష్ ప్యానెల్ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేస్తూ ఒకరిని ఒకరు దూషించుకున్న సంగతి తెలిసిందే. అవినీతి ఆరోపణలతోనూ `మా` పరువు మర్యాదల్ని మంటకలిపారన్న బ్యాడ్ నేమ్ వచ్చింది. అయితే ఎన్నికల తర్వాత అయినా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా – ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ఇద్దరిలో ఏదైనా మార్పు వచ్చిందా అంటే ఇప్పటికీ అదే శైలిలో ఆ ఇద్దరూ ఒకరినొకరు దూషించుకోవడం ఇండస్ట్రీలో చర్చకు వచ్చింది. పలుమార్లు మీడియా సమావేశాలే ఏర్పాటు చేసి ఒకరినొకరు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం పై ఆర్టిస్టులు సహా పరిశ్రమలో చర్చ సాగింది. వ్యక్తిగత కక్షలతో వ్యవస్థను కించపరిచారన్న విమర్శల్ని ఇరువురూ ఎదుర్కొంటూనే ఉన్నారు.

ఇప్పటికీ ఆ ఇద్దరూ ఇంకా మీడియా సమావేశాల పేరుతో.. వీడియోలతో దూషణలకు దిగడంపై చర్చ సాగుతోంది. ఇటీవలే శివాజీ రాజా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాజీ `మా` అధ్యక్షుడు.. మెగా బ్రదర్ నాగబాబుపై వ్యక్తిగత విమర్శలు చేశారు. అయితే దీనిపై ఇంతకాలం స్ప ందించని ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ తాజాగా మరో వీడియో చాట్ తో శివాజీ రాజా తీరుపై విమర్శలు గుప్పించారు. శివాజీ రాజా అనవసరంగా వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని నరేష్ అన్నారు. చిరంజీవి గారు.. నాగబాబు.. శివాజీ రాజా .. అధ్యక్షులుగా ఉన్న టైమ్ లో మంచి పనులు జరిగాయి. కానీ కొన్ని చిన్న పాటివి ఉంటాయి. అయితే శివాజీ రాజా వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదు అని అన్నారు.

నాగబాబు అంగ వైకల్య ంతో నడవలేకపోతున్నారని శివాజీ రాజా అనడం ఆర్టిస్టుగా పర్సనల్ గా డ్యామేజ్ చేసినట్టే. అంతేకాదు.. నాగబాబు `మా అసోసియేషన్` కి ఏం చేశారు. అని ప్రశ్నించారు. ఆయన టైమ్ లోనూ కొన్ని మంచి పనులు జరిగాయి. జరగలేదని ఎలా చెబుతారు? ఆర్టిస్టుల కోసం పలు పథకాల్ని అమలు చేశారు. నాగబాబు మా విషయంలో పిల్లికి బిక్షం పెట్టలేదు అని మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజేంద్ర ప్రసాద్ .. శివాజీ రాజా గెలిచినప్పుడు నాగబాబు సపోర్టుగా నిలిచారు. ఆయన ఫ్యామిలీ తరపున రూ.6లక్షలు డొనేట్ చేశారు. అవన్నీ రికార్డుల్లో ఉన్నాయి. అందుకే `మా` ని పబ్లిక్ లోకి లాగొద్దని అంటున్నా. పర్సనల్ గా నిందించుకోవడం తగదని చెబుతున్నాను. ఇది శివాజీ రాజాని నిందించాలని కాదు. మెగా ఫ్యామిలీని తిట్టడం `మా`కు వ్యక్తిగతంగా అవసరం లేదు కదా.. రాజకీయంగా విమర్శించినప్పుడు సరే అనుకున్నా.. ఇకపై మా విషయంలో వివదాలు వద్దు. ఎవరినీ వ్యక్తిగతంగా దూషించవద్దని మా సభ్యులను కోరుతున్నా అని అన్నారు. నాగబాబు గారిపై కామెంట్స్ ని ఖండిస్తున్నాను. ఆయన్ని పర్సనల్ గా దూషించవద్దని సీనియర్ నరేష్ అన్నారు.
Please Read Disclaimer