శ్రీరెడ్డి విషయంలోనూ ‘మా’లో బిన్నాభిప్రాయాలు

0ఇన్నాళ్లు చాపకింద నీరులా ఉన్న మా లో విభేదాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. గత కొంత కాలంగా మా అధ్యక్షుడు మరియు జనరల్ సెక్రటరీల మద్య కోల్డ్ వార్ జరుగుతుందని తాజాగా తేలిపోయింది. మొన్నటి వరకు మీడియా ముందు అంతా కలిసే ఉన్నాం అంటూ చెప్పుకొచ్చిన వారు ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా అవినీతి జరుగుతుంది అంటూ ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ఈ సమయంలోనే శివాజీ రాజా – శ్రీకాంత్ ల ప్రెస్ మీట్ జరిగింది. వారి ప్రెస్ మీట్ కు కౌంటర్ అన్నట్లుగా నరేష్ కూడా ప్రెస్ మీట్ ను నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ లో పలు విషయాలను లేవనెత్తడంతో పాటు శ్రీరెడ్డి విషయంపై కూడా నరేష్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

సినిమా పరిశ్రమలో కొందరిపై శ్రీరెడ్డి విమర్శలు చేయడంతో వెంటనే ఆమెకు మా సభ్యత్వం ఇవ్వొదని – ఆమెను ఏ తెలుగు సినిమాల్లో కూడా తీసుకోవద్దంటూ కఠిన నిర్ణయంను మా వారు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం విషయంలోనూ ఏకాభిప్రాయంతో మా సభ్యులు వ్యవహరించలేదు అంటూ తాజాగా నరేష్ వ్యాఖ్యలతో తేలిపోయింది. శివాజీ రాజా ఆగమేఘాల మీద శ్రీరెడ్డిపై చర్యలకు నిర్ణయం తీసుకున్నాడు. ఆ విషయంలో తాను ముందు నుండే వ్యతిరేకించాను. కాని ఆమెను క్షమిస్తే ఇంకా ఎంతో మంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు అంటూ అధ్యక్షుడి హోదాలో ఆమెపై బ్యాన్ ను విధించాడు.

శ్రీరెడ్డి విషయంలో మా వ్యవహరించిన తీరు సరైనది కాదు అంటూ తాను ఇప్పటికి కూడా చెబుతూనే ఉన్నాను. నేను అన్నట్లే ఆ నిర్ణయం కాస్త వివాదం అవ్వడంతో వెంటనే మళ్లీ హడావుడిగా ఆమెపై బ్యాన్ ను ఎత్తివేయడంతో పాటు ఆమెకు సభ్యత్వం ఇచ్చేందుకు ఓకే చెప్పడం వంటి హడావుడి నిర్ణయాలతో మా పరువు పోయింది. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉన్నప్పుడు మాత్రమే గౌరవం ఉంటుంది. ఒక పెద్ద సంస్థ అధ్యక్షుడు అయ్యి ఉండి తాను తీసుకున్న నిర్ణయంను వారం రోజుల్లోనే రద్దు చేసుకోవడంతో మా పరువు పోయింది. శ్రీరెడ్డి విషయంలో జరిగిన తప్పిదాలే సిల్వర్ జూబ్లీ వేడుక సమయంలో కూడా జరిగాయి జరుగుతూనే ఉన్నాయి అంటూ నరేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.