పులితో సెల్ఫీ దిగిన యంగ్ హీరో!

0టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ ….సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. తన సినిమాలకు సంబధించిన అప్ డేట్స్ తో పాటు సామాజిక అంశాలపై కూడా నవదీప్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టులు చేస్తుంటాడు. కొద్ది రోజుల క్రితం తన లైఫ్ సరైన దిశలో పయనించడం లేదనే క్యాప్షన్ తో నవదీప్ పోస్ట్ చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ ఫొటో వైరల్ అయింది. తాజాగా అదే తరహాలో నవదీప్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో మరో పోస్ట్ పెట్టాడు. ఓ అడవిలో పులికి అతి సమీపం నుంచి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు. అంతేకాకుండా దానికి “ఏరా పులీ“ అన్న క్యాప్షన్ ను పెట్టాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫొటోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

ఓ అడవిలో పడుకొని ఉన్న పెద్ద పులికి అతి సమీపంలో నిలుచొని నవదీప్ సెల్ఫీ దిగాడు. ఆ ఫొటోలో నవదీప్ ఒక కన్ను మాత్రమే కనిపిస్తుండగా….బ్యాక్ గ్రౌండ్ లో పులి పడుకొని ఉంది. ఆ ఫొటోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో నవదీప్ పోస్ట్ చేశాడు. అంతేకాదు దానికి “యమదొంగ“లో ఎన్టీఆర్ ను ఉద్దేశించి విలన్ చెప్పే పాపులర్ డైలాగ్ “ఏరా పులీ..“ ని క్యాఫ్షన్ గా పెట్టాడు. అయితే ఆ ఫొటో ఎక్కడ దిగిన సంగతి నవదీప్ వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు నవదీప్ పై రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఆ ఫొటో ఎక్కడ తీశారు…పులితో ఏం చేస్తున్నారు…అంటూ ప్రశ్నిస్తున్నారు. తన కారులో నుంచి నవదీప్ ఫొటో దిగాడని నిజంగా అంత దగ్గర నుంచి ఫొటో దిగడం కష్టమని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.