బిగ్ బాస్ లో ప్రియాంక జూనియర్

0Navpreet-Banga-Join-Bigg-Bossసినిమా స్టార్స్ గురించి మనం ఎంతగా మాట్లాడుకుంటమో ఇప్పుడు జరుగుతున్నా టివి షో లు గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నాం. మరీ ముఖ్యంగా రియాలిటీ షోలు పై జనాలలో ఉండే క్రేజ్ మామూలుగా లేదు. టాక్ షో కావచ్చు డాన్స్ షో కావచ్చు కామిడీ షో కావచ్చు ఇలా ఏ టివి షో అయిన ఆ షో కొత్తదనంతో ఆసక్తి పెంచి టిఆర్ పి లు సంపాదిస్తున్నారు టివి చానల్స్. ఇప్పుడు దేశం మొత్తం చూస్తున్న టివి షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి. హిందిలో ఈ బిగ్ బాస్ షోకి హోస్ట్ గా సల్మాన్ ఖాన్ చేస్తున్నాడు. ఈ మధ్యనే సీజన్ 11 ప్రోమో కూడా విడుదల చేశారు. బిగ్ బాస్ 11 లో ఎవరు పాల్గొంటారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది బాలీవుడ్ మీడియాలో.

అచింత్ కౌర్ – దేవోలీనా భట్టాచార్జీ – నందీష్ సంధు లాంటి కొంతమంది టివి స్టార్లు ఇప్పటికే కంటెస్టంట్లు గా ఉన్నారు అనే వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరో కొత్త సంచలమైన వార్త ఒకటి బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చింది. నవప్రీత్ బంగా అనే మోడల్ టివి స్టార్ బిగ్ బాస్ 11 కి రాబోతుంది అనే వార్తలు వచ్చాయి. ఆమె వస్తే ఏంటి అంతా పెద్ద విశేషమా అని అనుకోవచ్చు మీరు విషయం ఏంటంటే ఈమె బాలీవుడ్ సూపర్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు జిరాక్స్ కాపీలా ఉంటుంది. ఆమె ఫోటోలు కానీ ఫోటో షూట్లు కానీ అచ్చం ప్రియాంక చోప్రా ఏమో అన్నంత గా ఉంటాయి. ఇప్పుడు ఈ జూనియర్ ప్రియాంక చోప్రా బిగ్ బాస్ 11 లో కంటెస్టంట్ గా ఉంటే ఇంకా ఆ షో లో వింత అనుభవాలు కొత్త వివాదాలు రాకతప్పదు. దానితో ఈ చానెల్ టిఆర్పి పెరగకామానదు.

నవప్రీత్ ఇంటర్నెట్ లో మంచి ఫేమస్ స్టార్ కూడాను. ఆమె ఫిట్నెస్ ఫోటోలు మన యూత్ కి మంచి కిక్ ఇస్తూ ఉంటాయి. అంతే కాకుండా ఈ జూనియర్ ప్రియాంక కొన్ని కుకింగ్ వీడియోలలో కూడా చేసింది. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ 11 లో తీసుకోవడానికి ప్రధాన కారణం ఆమె మోడలింగ్ లో ఫేమస్ అని కాదట.. ఆమె ప్రియాంక లా ఉండటమే అని టాక్.