నవాబ్ జోరు దేవదాస్ బేజారు

0

అక్కినేని నాగార్జున – నాని ల మల్టిస్టారర్ ‘దేవదాస్’ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అదే రోజు మణి రత్నం గ్యాంగ్ స్టర్ డ్రామా ‘నవాబ్’ కూడా విడుదలయింది. ఓవర్సీస్ లో ‘దేవదాస్’ ప్రిమియర్ కలెక్షన్స్ $162405 కాగా ‘నవాబ్’ ప్రిమియర్ల ద్వారా సాధించిన కలెక్షన్స్ $82354 మాత్రమే. అంటే దాదాపు సగం.

కానీ నెమ్మదిగా ‘దేవదాస్’ కలెక్షన్స్ తగ్గుతూ ఉంటే ‘నవాబ్’ కలెక్షన్స్ మాత్రం స్టడీగా ఉన్నాయి. ప్రీమియర్స్ సంగతి పక్కనబెడితే గురువారం నుండి ‘దేవదాస్’ కంటే ‘నవాబ్’ (తమిళ వెర్షన్ ‘చెక్క చివంత వానమ్’ కూడా) దే హవా. గురువారం నాడు ‘నవాబ్’ కలెక్షన్స్ $90069 అయితే దేవదాస్ $88316. శుక్రవారం $174209 ‘నవాబ్’ సాధించగా ‘దేవదాస్’ మాత్రం $136833 తో సరిపెట్టుకోవలిసి వచ్చింది.

శనివారం నాడు ఆఖరి వివరాలు అందే సమయానికి ‘నవాబ్’ టోటల్ కలెక్షన్స్ $566935 కాగా ‘దేవదాస్’ $536570. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ‘నవాబ్’ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్ జోన్ లోకి వచ్చాడు. కానీ ‘దేవదాస్’ సేఫ్ జోన్ లోకి రావాలంటే $1.2 మిలియన్స్ కలెక్ట్ చేయవలసి ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్ ను బట్టి చూస్తుంటే అది చాలా పెద్ద టార్గెట్. డొమెస్టిక్ మార్కెట్ విషయం ఎలా ఉన్నా ఓవర్సీస్ లో మాత్రం మణి సార్ బ్రాండ్ నేమ్.. స్టార్ క్యాస్ట్.. పాజిటివ్ రివ్యూస్ ‘నవాబ్’ కు ప్లస్ అయ్యాయి. అదే ‘దేవదాస్’ కు మిక్స్డ్ రివ్యూస్ రావడం ఓవర్సీస్ లో ప్రభావం చూపించింది.
Please Read Disclaimer