ఇంతకీ ఎవరు నవాబ్?

0ఈరోజుల్లో క్రిమినల్స్ కి చాలా పేర్లున్నాయి…
పారిశ్రామికవేత్త… విద్యావేత్త.. రియల్ ఎస్టేట్ కింగ్.. ఇసుక మాఫియా.. భూపతి..
ఈ భూపతి ఎవరు? రియల్ ఎస్టేట్.. బిజినెస్ మేన్.. రియల్ ఎస్టేట్ టైకూన్.. మాఫియా ఫ్రెండా?

ఈ సంభాషణల్ని బట్టి చెప్పేయొచ్చు. ఇదో మాఫియా డాన్ కథ అని. గత కొంతకాలంగా నవాబ్ ప్రచారంలో ఒక్కో పోస్టర్ వేడెక్కించేస్తున్నాయ్. అరవింద స్వామి – శింబు – విజయ్ సేతుపతి – జ్యోతిక – అరుణ్ విజయ్ లాంటి స్టార్లు ఈ చిత్రంలో నటిస్తుండడం.. మణిరత్నం లాంటి సీనియర్ దర్శకుడు ఈ సినిమా తెరకెక్కిస్తుండడంతో ఒకటే ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెర దించుతూ నవాబ్ అధికారిక ట్రైలర్ రిలీజైంది. మణిరత్నం శైలిలోని మరో గ్రిప్పింగ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చూడబోతున్నామని ట్రైలర్ చూస్తే చెబుతోంది. ఇందులో కూడా మణి స్టైల్లో పోయెటిక్ సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. అసలింతకీ భూపతి ఎవరు? అంటూ బోలెడంత సస్పెన్స్ ని లీడ్ చేశారు. అయితే ట్రైలర్ ఆరంభమే ప్రకాష్ రాజ్ ని చూపిస్తూ భూపతి ఎవరు? అని ప్రశ్నించారు కాబట్టి ఆయనే భూపతి అనుకోవచ్చు. కానీ అక్కడే ఉంటుంది అసలు ట్విస్టు.. అదే మణిరత్నం శైలి. ఇందులోనే ఓ ఫ్యామిలీ ఫోటోని చూపించి సడెన్ ట్విస్టిచ్చారు. ఆ ఫోటోలోని అన్నదమ్ములే వీళ్లంతా.. అధికారికం కోసం కొట్లాట అన్న ట్విస్టు ఆకట్టుకుంటోంది. అందుకే నవాబ్ ఉత్కంఠ పెంచుతోంది. మణిరత్నం మరోసారి తన అభిమానులకు విజువల్ ట్రీట్ ని అందిస్తారనే అంచనా వేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్ తో కలిసి నిర్మిస్తోంది. రసూల్ పోకుట్టి సౌండింగ్ – రెహమాన్ సంగీతం ఆకట్టుకుంటున్నాయి. ఈ భూపతి ఎవరు? రియల్ ఎస్టేట్.. బిజినెస్ మేన్.. రియల్ ఎస్టేట్ టైకూన్.. మాఫియా ఫ్రెండా? అంటూ నైజాం పోరి అదితీరావ్ హైదరీ జర్నలిస్టుగా ఇచ్చిన ట్విస్టు మామూలుగా లేదు. మొత్తానికి ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమాలో మ్యాటర్ ఎంతో చూడాల్సి ఉందింకా.