నయన్ మళ్లీ కమీట్ అయింది

0

nayantara-in-balayya-new-movieబాలయ్య సరసన పలు సినిమాల్లో నటించిన నయనతార ఆయన్ను వదలలేక పోతున్నట్లుంది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినా మంచి అవకాశాలతో దూసుకుపోతున్న నయనతార మరో సారి బాలయ్యతో నటించబోతున్నట్లు వార్తలు. మొన్నటి వరకు వయస్సున్న హీరోల ప్రక్కనే నటిస్తానని, వయస్సైపోయిన సీనియర్ హీరోల ప్రక్కన నటించనని బీరాలు పలికిన నయన్ మళ్లీ ఇప్పుడు ఆయన చెంతనే చేరిందని అంటున్నారు.

ప్రస్తుతం బాలయ్య – బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రూలర్ ’ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించడానికి అంగీకరించినట్లు తాజాగా సమాచారం. అప్పట్లో ఈమెను నటించమని అడిగితే డేట్లు ఖాళీ లేవని ఏవో సాకులు చెప్పిన నయన్ ఇప్పుడు మళ్లీ అవకాశాలు సన్నగిల్లడం, అటు ఈమె నటిస్తున్న ‘అనామిక ’ షూటింగ్ అయిపోయి కాస్తంత ఖాళీ దొరకడంతో నటించడాని ఒప్పుకుందని ఏమైనా నయన్ చాలా తెలివైందని, అవకాశం వస్తే వయస్సుతో సంబంధం లేకుండా కమీట్ అవుతుందని సినీ జనాలు అంటున్నారు.

Nayanatara confirmed in Balayya Ruler movie,  once again balayya nayanatara share the sceen,  Balakrishna to Romance with Nayanatara in Ruler movie,  Nayanatara in Ruler movie,  spacer
నయన్ మళ్లీ కమీట్ అయింది
Please Read Disclaimer