నయన్ – విఘ్నేష్ ఫ్రెండ్ షిప్ పిక్…వైరల్!

0కోలీవుడ్ లోని ప్రేమజంటల్లో నయన్ విఘ్నేష్ లు ప్రత్యేకమని చెప్పవచ్చు. ప్రస్తుతం విఘ్నేష్ …సక్సెస్ వెనుక నయన్ ఉందన్నది ఓపెన్ సీక్రెట్. ప్రభుదేవాతో బ్రేకప్ అయిన తర్వాత నయన్…విఘ్నేష్ లు దగ్గరయ్యారు. `నానుమ్ రౌడీ దాన్ `చిత్ర సమయంలో చిగురించిన వీరి ప్రేమ…ఇపుడు పట్టాలెక్కింది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని…. విదేశాల్లో కూడా చక్కర్లు కొట్టారు. ఈ లవ పెయిర్ …తమ ఫొటోలను ఎప్పటికపుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా స్నేహితుల దినోత్సవం నాడు విఘ్నేష్ చేసిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నయన్ కళ్లలోకి కళ్లుపెట్టి చూస్తోన్న విఘ్నేష్ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

స్నేహితుల దినోత్సవం నాడు నయనతారకు విఘ్నేష్ విషెస్ చెబుతూ ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. నయన్ చేతిలో చేయి వేసి కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తోన్న విఘ్నేష్…..పిక్ వైరల్ అయింది. అయితే ప్రేమికుడైన విఘ్నేష్….ఆమెకు ఫ్రెండ్ షిప్ డే విషెస్ చెప్పడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా?…దానికి విఘ్నేష్ తన రచనాపటిమనుపయోగించి క్యాప్షన్ కూడా పెట్టాడు. `ఈ ప్రేమలో అపరిమితమైన స్నేహం ఉంది. స్నేహంలోనూ అమితమైన ప్రేమ ఉంది` అని విఘ్నేష్ తన భాషా ప్రావీణ్యాన్నిప్రదర్శించాడు. ప్రస్తుతం నయనతార తెలుగులో సైరాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. నయన్ లీడ్ రోల్ పోషించిన `కొలమావు కోకిల(కోకో కోకిల) రిలీజ్ కు రెడీగా ఉంది. శివ కార్తికేయన్ తో ఓ సినిమాను తెరకెక్కించేందుకు విఘ్నేష్ సిద్ధమవుతున్నాడు.