పెళ్ళి అయినా కానట్టే కలరింగ్ ఇస్తోందా?

0

సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార మిగతా స్టార్ హీరోయిన్ల కంటే చాలా భిన్నం. పెద్ద పెద్ద స్టార్లతో కలిసి నటించి టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. చిన్న బడ్జెట్ సినిమాల్లో నటించడమే కాదు. ఊరు పేరు లేని హీరోలతో రొమాన్స్ చేసేందుకు యస్ చెప్పి అందరినీ షాక్ కు గురిచేసింది. కంటెంట్ తప్ప స్టార్లను చూడకుండా సినిమాలు చేయడంతో వరస సక్సెస్ లు వస్తున్నాయి. దీంతో సౌత్ లోనే హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా మారింది.

ఇది ప్రొఫెషనల్ సంగతి అయితే.. పర్సనల్ లైఫ్ అదో పెద్ద బుక్కు. అందరిలా హీరోయిన్ల లాగా తన లవ్ స్టొరీలను ఎప్పుడూ దాచుకోలేదు. శింబుతో ప్రేమ వ్యవహారం ఓపెనే.. బ్రేకప్ కూడా అందరికీ తెలిసిందే. సెకండ్ లవ్ స్టొరీ ప్రభుదేవా తో. ఆ తర్వాత బ్రేక్ అప్ కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక మూడో లవ్ స్టొరీ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఈ విషయంలో మాత్రం మునుపటిలా ఓపెన్ గా మాట్లాడడం లేదు. జంటగా విహారయాత్రలు చేస్తారు.. ఫోటోలు దిగుతారు. ఇండైరెక్ట్ గా మేము లవర్స్ అంటూ హింట్స్ ఇస్తారు.

ఇదిలా ఉంటే తమిళ మీడియా మాత్రం నయన్-విఘ్నేష్ లకు ఎప్పుడో పెళ్ళయిపోయిందని.. ఇద్దరూ ఇప్పుడు భార్యాభర్తలని చాలా రోజులనుండీ మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ నయన్ మాత్రం ఈ విషయం పై పెదవి విప్పడం లేదు. కోలీవుడ్ తాజా గాసిప్ ఏంటంటే త్వరలో మళ్ళీ లాంఛనంగా పెళ్ళి చేసుకుని అధికారికం చేస్తారట. ఏంటో ఈ ప్రేమలు.. పెళ్ళిళ్ళు. నిజాలు బయటకు రావాలంటే థగ్స్ ను రెండు సార్లు బ్యాక్ టూ బ్యాక్ షోలు చూపిస్తే చాలు!
Please Read Disclaimer