నయన్.. ఈ దెబ్బతో స్టార్ హీరోయిన్..

0నయనతార.. ఈమె జీవితమే ఎగుడుదిగుడుగా సాగింది. ఇప్పటికి ముగ్గురితో సాగించిన ప్రేమాయణం తీరాలకు చేరలేకపోయింది. మొదట శింబుతో సాగించిన ప్రేమ డీప్ గా సాగి నయన్ ను డిప్రెషన్ లోకి నెట్టింది. శింబుతో ప్రేమలో ఉన్నప్పుడు చాలా సినిమాలు వదులుకుంది. అనంతరం మొన్నీ మధ్యే ప్రభుదేవ కూడా ఇలానే షాక్ ఇచ్చాడు. ఇక ముచ్చటగా ఇప్పుడు మూడో ప్రేమలో నయన మునిగి తేలుతుందట. ఇలా ప్రేమ వ్యవహారాల వల్లే నయన్ చాలా సినిమా అవకాశాలు కోల్పోయింది.

నయన్ ను తమిళనాట అగ్రహీరోలు తమ సినిమాల్లోకి తీసుకోవడం లేదు. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. లేడి ఓరియెంటెడ్ మూవీలు ఆమెకు వరుసగా వస్తున్నాయి. ఇటీవలే నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘మయూరి’ ‘కర్తవ్యం’ మూవీలు హిట్ అయ్యి నయనను స్టార్ హీరోయిన్ ను చేశాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాల తర్వాత నయన చేస్తున్న మూడో లేడిఓరియెంటెడ్ ‘కోలమావు కోకిల’ శుక్రవారం రిలీజ్ అయ్యింది. మంచి అంచనాలతో రిలీజ్ అయ్యి తమిళనాట సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

కోలమావు కోకిల నయనతార కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా రివ్యూలు వచ్చేశాయి. ఆద్యంతం వినోదాత్మక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇదీ.. ఈ చిత్రం మొత్తం నయనతారే నడిపించింది. ఆమె నటన స్క్రీన్ ప్రజెన్స్ గురించి ప్రతి ఒక్కరు పొగుడుతున్నారు. 25 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను కుటుంబంతో కలిసి ఆమె వ్యాన్లో ఎలా తరలించిందనేది కథ.. ఈ క్రమంలో వాళ్లకు ఎదురయ్యే ఇబ్బందులు కామెడీ సీన్లు సస్పెన్స్ బాగా పేలాయట.. ఈ చిత్రం తెలుగులోనూ రిలీజ్ కావాల్సి ఉన్నా ఆలస్యమైపోయింది. ఈ మూవీ దెబ్బతో నయనతార తమిళనాట లేడి సూపర్ స్టార్ గా ఎదిగిపోయిందని కితాబిస్తున్నారు.