ప్రియుడితో నయన్ పెళ్లికి రెడీ

0

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార తో యువదర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమాయణం గురించి తెలిసిందే. ఈ జంట పెళ్లాడేందుకు ఇంకెంతో సమయం పట్టదని నాలుగేళ్లుగా ప్రచారం సాగుతూనే ఉంది. అయితే పెళ్లి మ్యాటర్ పై ఆ ఇద్దరిలో ఎవరూ ఎప్పుడూ క్లారిటీ ఇచ్చిందే లేదు. అయితే తాము ప్రేమలో ఉన్నామని.. సహజీవనం చేస్తున్నామని ఎన్నోసార్లు ప్రూఫ్ లు ఇచ్చారు. పండగలు పబ్బాల వేళ ఇరు కుటుంబాలు కలిసి విదేశాల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆ క్రమంలోనే పెళ్లి వార్త రావొచ్చని భావించినా చాలా సార్లు అభిమనులకు నిరాశ తప్పలేదు. ఒకానొక దశలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ చెప్పడం లేదనే అభిమానులు సందేహించారు. నయన్ కెరీర్ దృష్ట్యా ప్రస్తుత సన్నివేశంలో ఇక పెళ్లి మాట ఉండదనే భావించే పరిస్థితి కనిపించింది.

అయితే ఇంతలోనే ఊహించని ఓ షాక్. నయనతార- విఘ్నేష్ జంట తొందర్లోనే పెళ్లికి రెడీ అవుతున్నారు. సాధ్యమైనంత తొందర్లోనే నిశ్చితార్థానికి సంబంధించిన వార్త అందుతుందని.. ఈ ఏడాది నిశ్చితార్థం చేసుకుని వచ్చే ఏడాది పెళ్లాడే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. నిశ్చితార్థం అనంతరం ఓ అరడజను కమిట్ మెంట్లను పూర్తి చేసుకుని నయన్ తీరిగ్గా పెళ్లాడాలనుకుంటున్నారట. ఇకపోతే పెళ్లి తర్వాత కథానాయికలకు అవకాశాలు దక్కడ ం అన్నది కాస్తంత కష్టమే. పరిమితంగా ఒక జానర్ కే అంకితమై నటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జోరు ఉండదనే నయన్ ఇంతకాలం పెళ్లి మాటెత్తలేదు. అయితే ఇక వ్యక్తిగత జీవితంపైనా దృష్టి సారించాలనే ఆలోచనకు వచ్చేశారని తాజా సీన్ చెబుతోంది.

ఇక కెరీర్ పరంగా చూస్తే నయన్ ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీ బెస్ట్ చిత్రాల్లో నటిస్తోంది. చిరంజీవి `సైరా నరసింహారెడ్డి`- రజనీ దర్బార్- విజయ్ – దళపతి 63 చిత్రాల్లో తనే కథానాయిక. వీటితో పాటే మిస్టర్ లోకల్ లవ్ యాక్షన్ డ్రామా కొళయితిర్ కాలం వంటి చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఈ కమిట్ మెంట్లు అన్నిటినీ పూర్తి చేశాక పెళ్లికి రెడీ అవుతారన్నమాట.
Please Read Disclaimer