బ్రదర్ బ్యూటి.. నాలుగేళ్ళ తరువాత

0తెలుగులో డైరెక్ట్ సినిమాలు ఏమి చేయకపోయినా డబ్బింగ్ సినిమాలలో తన నటనతో మనల్ని తన వైపు తిప్పుకున్న అందాల భామ నజ్రియా నజిమ్. రాజా రాణి సినిమాలో ఆర్య ను బ్రదర్ అని కవ్విస్తూనే ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంది. ఒక నాలుగేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె మళ్ళీ మాయ చేసేందుకు రాబోతోంది.

2014 లో తిరుమనం ఇనుమ్ నిక్క అనే తమిళ్ సినిమా తరువాత ఈమె ఎప్పుడు తెరపైన కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ అంజలి మీనన్ కూడే సినిమాలో మన ముందుకు వచ్చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తాలూకు పాట ప్రోమో వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. బెంగళూర్ డేస్ సినిమా తో నాజ్రియా కు బ్రేక్ ఇచ్చిన అంజలి నే మళ్ళీ తనను మనముందుకు తీసుకురావడం విశేషం. ఈ ప్రోమో చూస్తూనే ఈ సినిమా అంజలి మార్క్ రొమాన్స్ ఉంటుందని అర్థమైపోతోంది.

ఇదొక రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ లా తెరకెక్కనుంది. రెండు రోజుల క్రితమే ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేసారు. ఇప్పుడు ఈ ప్రోమో వీడియోతో మరింత హైప్ ను పెంచేశారు. ప్రేక్షకుల నుండి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రిథ్వీరాజ్ సుకుమారన్ మరియు పార్వతి కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా జూన్ ఆఖరులో విడుదల కానుంది.