రీమేక్ లో కొత్త రికార్డు

0Neelakanta To Direct Queen Malayalam Remake

ఒకే కథను నాలుగు భాషల్లో వేర్వేరు నటులు దర్శకులతో తీయటం చాలా అరుదుగా జరుగుతుంది. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం శాండల్ వుడ్ స్టార్ హీరో రవిచంద్రన్ స్వీయ దర్శకత్వంలో శాంతి క్రాంతి అనే సినిమాను తెలుగులో నాగార్జునతో తమిళ్ లో రజనీకాంత్ తో కన్నడలో తానే హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మించినప్పుడు అందరూ ముక్కున వేలేసుకున్నారు. అఫ్ కోర్స్ రిజల్ట్ హోల్ సేల్ గా తేడా కొట్టేసింది. అది వేరే సంగతి. అచ్చంగా అలాంటి ఫీట్ ఇప్పుడు క్వీన్ రీమేక్ విషయంలోనూ జరుగుతోంది. కాకపోతే ఇక్కడ దానికి మించిన ప్రత్యేకతలు ఉన్నాయి.

ఇది నాలుగు భాషల్లో రూపొందుతుండగా ఒక్కో వెర్షన్ కు వేర్వేరు దర్శకులు ఉండటం విశేషం. కాకపోతే ముందు అనుకున్న వాళ్ళు కాకుండా షటిల్ సర్వీస్ లాగా అటు ఇటు మారిపోవడం కూడా జరిగింది. తెలుగు వెర్షన్ ను తొలుత నీలకంఠతో స్టార్ట్ చేసారు. తమన్నా టైటిల్ రోల్. తెరవెనుక ఏం జరిగిందో చెప్పలేదు కానీ నీలకంట దర్శకత్వం నుంచి తప్పుకుని మలయాళ వెర్షన్ ను ఎత్తుకున్నాడు. కొంత గ్యాప్ తర్వాత నేను ఫినిష్ చేస్తాను అంటూ ముందుకు వచ్చిన ప్రశాంత్ వర్మ తక్కువ టైం లో ఫినిష్ చేసేసి దటీజ్ మహాలక్ష్మి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసాడు. నీలకంఠ మలయాళీ టేకప్ చేయడానికి ముందు దాన్ని నటి రేవతి డైరెక్ట్ చేసేందుకు ఫిక్స్ చేసారు. కానీ ఏదో మతలబు కారణంగా ఆవిడ తమిళ్ వెర్షన్ తీసుకున్నారు. మలయాళంలో మంజిమా మోహన్ చేస్తుండగా తమిళ్ లో కాజల్ అగర్వాల్ తో జట్టు కుదిరింది. కన్నడలో సీనియర్ హీరో రమేష్ అరవింద్ దర్శకత్వంలో పరుల్ యాదవ్ తో పూర్తి చేసారు.

ఇప్పుడు నాలుగు వెర్షన్లు రెడీగా ఉన్నాయి. నిజానికి తెలుగు వల్లే లేట్ చేసారు. అక్టోబర్ విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా నలుగురు హీరోయిన్లు నలుగురు దర్శకులతో నాలుగు భాషల్లో ఒకే కథతో తెరకెక్కిన అరుదైన రీమేక్ గా క్వీన్ రీమేక్ ప్రత్యేకతను సంతరించుకుంది. హిందీలో కంగనా రౌనత్ చేసిన క్వీన్ ఒరిజినల్ సంచలన విజయం సాధించింది. హీరో అంటూ ఎవరూ ప్రత్యేకంగా లేకుండానే 100 కోట్లకు పైగా వసూళ్లతో సెన్సేషన్ అయ్యింది. రీమేక్ చేయటంలో కాస్త ఆలస్యమైనా మొత్తానికి ఆసక్తిని రేపుతోంది.