భర్త సెక్స్ సీన్లు చూసి భార్య షాక్

0Samir-Soni-For-Intimate-Scenesబాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ టీవీ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. ట్రెండుకు తగ్గట్లుగా బాగానే దూసుకెళ్తూ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ తో సినిమాలు తీయడంలో ఆమె దిట్ట. ఏక్తా నిర్మించిన రాగిని ఎంఎంఎస్.. డర్టీ పిక్చర్.. లాంటి సినిమాల్లో ఇంటిమేట్ సీన్లు ఏ రేంజిలో పేలాయో తెలిసిందే. తాజాగా ఆమె తన బాలాజీ మోషన్ పిక్చర్స్ బేనర్ మీద ‘బేవఫా సి వాఫా’ అనే వెబ్ సిరీస్ ప్లాన్ చేసింది. అందులో సమీర్ సోనీ అనే నటుడు లీడ్ రోల్ చేశాడు. అతడి సరసన డిపాంటియా శర్మ.. అదిత వాసు నటించారు. ఈ వెబ్ సిరీస్.. వివాహేతర సంబంధాల నేపథ్యంలో సాగుతుంది. ఇందులో భాగంగా హీరోయిన్లిద్దరితోనూ మాంచి ఇంటిమేట్ సీన్లు చేశాడట సమీర్.

ఐతే సమీర్ ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న ముందు నుంచి అతడి భార్య నీలంకు తెలిసినప్పటికీ.. అతను చేసిన సెక్స్ సీన్లలో డోస్ ఆ స్థాయిలో ఉంటుందని ఆమె అనుకోలేదట. ఈ మధ్య భర్త నటించిన సన్నివేశాలు చూసి ఆమె షాక్ తిందట. ట్రైలర్ చూడగానే ఆమె తీవ్ర ఆవేదనకు గురైందట. ఈ విషయమై భర్తతో ఆమె గొడవ పెట్టేసుకుందట. దీంతో వెబ్ సిరీస్ లోని కొన్ని సన్నివేశాల్ని తొలగించాలని ఏక్తా కపూర్ ను అడగ్గా.. సాధ్యం కాదని చెప్పేశారట. ఆల్రెడీ షో రన్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కోతలేమీ పెట్టడానికి లేదని.. ఇవన్నీ ముందు ఆలోచించుకోవాల్సిందని ఆమె స్పష్టం చేసిందట. దీంతో సమీర్ భార్యకు ఎలా సర్దిచెప్పాలో తెలియక తల పట్టుకుంటున్నాడు.