గాయాలైన నటితో సెల్ఫీలా? ఛ ఛా!!

0Neha-Dhupiaచాలసార్లు మన లోకం తీరు చూస్తే కొంచం కోపం కొంచెం చిరాకు వస్తుంది. ఎవరు దేనికి ఎలా స్పందిస్తారో తెలియటం లేదు ఎప్పుడు ఎలా స్పందించాలో కూడా తెలియకుండాపోతుంది. సాదారణంగా మన ముందు ఎవరైనా జారిపడితే ముందు అందరికీ నవ్వే వస్తుంది ఆ తరువాత అయ్యో పాపం అనే ఆలోచన వస్తుంది దానికి ఒక సైకలాజికల్ రీజన్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఇటువంటి ధోరణి కొత్త రూపంలోకి మారింది. ప్రతి ఇద్దరిలో ఒకరికి కెమెరా ఫోన్లు ఉండటం తో మన స్టార్లుకు కొత్త ఇబ్బంది వచ్చింది.

అది ఏంటంటే సెల్ఫి మానియా. ఏమి చూసినా ఏమి జరిగిన ఒక సెల్ఫి తీసేసుకుంటున్నారు. అటువంటిది సినిమా తారలు కనిపిస్తే ఎందుకు వదులుతారు చెప్పండి. అంటే ఏ షూటింగ్ సమయంలోనో లేక ఏ ఫంక్షన్ దగ్గర కనిపిస్తే ఒక ఫోటో ఒక ఆటోగ్రాఫ్ అడిగితే పర్వాలేదు కానీ యాక్సిడెంట్ అయి ఒక హీరోయిన్ భాదపడుతుంటే అక్కడ కొంతమంది జనాలు ఇలా ఫోటోలు అడిగారు సిగ్గులేకుండా.

బాలీవుడ్ నటి నేహా ధూపియా తన ఆడియో ప్రమోషన్ కోసం చండీగఢ్ వెళ్లింది అంటా. ప్రమోషన్ పూర్తి చేసుకొని ముంబాయికి తిరిగి వెళ్లడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్తుంటే ఆమె కారు చిన్న యాక్సిడెంట్ కి గురైంది. అదృష్టం కొద్ది నేహా ధూపియాకు ఏ పెద్ద గాయాలు తగలలేదు. తన భుజానికి మాత్రం కొంచెం గాయాలు తగిలాయి అని చెబుతున్నారు. ఇలా జరగటం మూలాన రోడ్ పైనే గంట వరకు నిలిచిపోవలిసి వచ్చింది. ఈ సమయంలో అక్కడ జనాలు వచ్చి నేహా ను ఆటోగ్రాఫ్లు – సెల్ఫిలు అడిగారు. భుజం నొప్పి తో నేను ఇబ్బంది పడుతుంటే జనాలు ఏంటి ఇలా అడుగుతున్నారు అని నేహా బాగానే షాక్ తిన్నది. విన్న మనకే వింతగా అనిపిస్తే అక్కడ ఉన్న నేహా ధూపియా పరిస్థితి ఎలా ఉందో. మన ముందు తరాల పెద్దలు మన సామెతలతో జనాలను కాకులతో ఎందుకో పోల్చి చెప్పరో ఇప్పుడు అర్ధమైంది.