చురకత్తి చూపుల చిరుత!

0కొంతమంది బ్యూటీలంతే.. ఒక్క చూపుచాలు.. సూదంటు రాయిలా అబ్బాయిల మనసులో కసక్కని గుచ్చుకుంటుంది. ఆ ఒక్క చూపుతో విలవిలలాడిపోతారు అమాయకులైన అబ్బాయిలు. ఈ ‘చిరుత’ బ్యూటీ నేహ శర్మ అలాంటి చూపులతో చంపే బ్యూటీనే. ఇప్పటికే ఈ సుందరి ఎన్నో ఘాటు ఫొటోలతో నెటిజనులు నిద్రలేని రాత్రులు గడిపేలా చేసింది.

తాజాగా సండే స్పెషల్ ఫోటో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ రోజు మండే కదా.. సండే అయిపోయింది కదా అనుకోవద్దు మండే అయినా వేడి పుట్టించే సండే ఫోటో హీట్ ఇంకా తగ్గలేదు. ఇంతకీ ఈ ఫోటో స్పెషల్ ఏమనుకున్నారు? సగంపైగా చూపించి మిగతా సగం ఊహలకు వదిలేసే బాపతు కాదు. ఆసేలేమీ చూపించకుండా చురకత్తి చూపులతో అబ్బాయల మనసులకు గాయం చేయడమే లక్ష్యం పెట్టుకుని పోజిచ్చింది. ఈ రోజు మండే అయినా.. ఆఫీసులు కాలేజిలు ఉన్నా అందరూ తమ లైకులతో సుందరాంగికి తమవైపునుండి ఫుల్లు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ ఫొటోకు లక్షా యాభై వేలా లైకులు దాటిపోయాయి.

నేహా ఈమధ్యనే విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ‘జంగా’ అనే తమిళ్ సినిమాలో నటించింది. ఈ సినిమా కాకుండా ‘హేరా ఫేరీ-3’ లో అవకశం వచ్చిందని బాలీవుడ్ సమాచారం. సినిమా షూటింగ్ లకు గ్యాప్ వస్తే ఘాటు ఫోటోలు పెట్టడం ఈ బ్యూటీకి హాటు హాబీ.