‘నేల టికెట్’ కోసం భారీ సెట్..

0



‘టచ్ చేసి చూడు’ చిత్రంతో ప్రేక్షకులను పెద్ద టచ్ చేయలేకపోయిన మాస్ రాజా రవితేజ..ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో నేల టికెట్ మూవీ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ, ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుపుకోబోతుంది.

ఈ సెట్లోనే ఎక్కువ శాతం షూటింగ్ జరగనుందని సమాచారం. అలాగే మే నెల ఫస్ట్ వీక్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని , అదే నెలాఖరున చిత్రం విడుదల చేయాలనీ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. రేపు ఉగాది సందర్బంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్ళూరి నిర్మిస్తుండగా ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం తో పాటు రవితేజ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే చిత్రాన్ని కూడా మొదలు పెట్టాడు.