యూఎస్ లో నేల టిక్కెట్టు వసూళ్లు దారుణం..

0మాస్ మహారాజ్ రవితేజ – కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో మే 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘నేల టిక్కెట్టు’. మొదటి రోజే మిక్సెడ్ టాక్ రావడం తో ఈ ప్రభావం చిత్ర కలెక్షన్ల ఫై పడింది. అలాగే ఓపెనింగ్స్ కూడా చాల దారుణం గా వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యం గా ఓవర్సీస్ లో ఏమాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయలేకపోయింది. ప్రీమియర్స్ వేసిన కానీ ఆదరణ లేకుండా పోయింది.

సుమారు 80 లొకేషన్లలో ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ కేవలం 32,280 డాలర్లను మాత్రమే రాబట్టుకోగలిగింది. రవితేజ గత చిత్రాలు ‘టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్’ ప్రీమియర్ వసూళ్లతో పోలిస్తే చాలా తక్కువ అని తెలుస్తుంది. మరి ముందు ముందు వసూళ్లు ఎలా ఉంటాయి అనేది ప్రశ్న గా మారింది.