విడుదల వాయిదాపడ్డ నేనే రాజు నేనే మంత్రి!

0rana-answer-is-kajalఅవును రానా చేసిన తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ తమిళ వెర్షన్ విడుదల వాయిదాపడింది. ‘బాహుబలి’ తర్వాత తమిళమనాట రానా బాగా పాపులర్ అయ్యారు. అందుకే ఈ సినిమాను తెలుగుతో సమానంగా కోలీవుడ్లో రిలీజ్ చేయాలనుకున్నారు. అంతేగాక కొన్ని కీలక సన్నివేశాలని అక్కడి నటీ నటులతోనే చిత్రీకరించారు. పైగా ప్రస్తుత తమిళ రాజకీయాలకి కూడా సినిమా నైపథ్యం దగ్గరగా ఉండటంతో అక్కడి ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తి ఎక్కువైంది.

కానీ తాజా సమచారం ప్రకారం సినిమా కాస్త వాయిదాపడినట్టు తెలుస్తోంది. అయితే ఈ వాయిదా వెనుక గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అంతేకాక కొత్త విడుదల తేదీ కూడా బయటకురాలేదు. అయితే ఈ వార్తపై రానా అండ్ టీమ్ స్పందన ఏంటో తెలియాల్సి ఉంది. రానా సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని తేజ డైరెక్ట్ చేశారు.