నవంబర్ 8న నేనేం చిన్నపిల్లనా??

0Nenem-Chinna-Pillana-nov-8‘అందాల రాక్షసి’ఫేం రాహుల్‌, తన్వి వ్యాస్‌ జంటగా రూపొందిన చిత్రం ‘నేనేం..చిన్నపిల్లనా.. ?’. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి. రామానాయుడు నిర్మిస్తున్నారు. ‘రొమాంటిక్ క్రైమ్ కథ చిత్ర’ దర్శకుడు పి.సునీల్‌కుమార్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 8న విడుదలకు సిద్ధమయ్యింది. ఓ గ్రామం నుండి పట్టణానికి బయలుదేరిన అమ్మాయి కెరీర్ పరంగా తనను తాను ఎలా మలచుకుందనే కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించామని యూనిట్ చెబుతోంది. ఎం.ఎం శ్రీలేఖ మ్యూజిక్ అందించారు.

tags : rahul,ramanaidu,tanvi vyash, నవంబర్ 8న నేనేం చిన్నపిల్లనా??, nenem chinna pillana release date,