ఆర్.ఎక్స్ హీరో… పంచ్ పడిందిగా!

0పిల్లా రా పాట వీడియోని విడుదల చేస్తున్నాం…. ఇంక పండగ చేస్కోండి అంటూ `ఆర్.ఎక్స్.100` హీరో కార్తికేయ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. పాట విడుదల చేస్తున్నాం అనడం వరకు బాగానే ఉంది. పండగ చేస్కోండి అనే మాటే కొద్దిమంది ప్రేక్షకులకు రుచించలేదు. సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ లో ఉన్నాడని చాలామంది లైట్ గా తీసుకొన్నారు. కొద్దిమంది ఫాలోయర్స్ మాత్రం హీరోల్ని మించిన పంచ్ లు వేశారు. `పిల్లారా పాట విడుదల చేస్తే పండగేముంది? పిల్లని కూడా విడుదల చేస్తే అప్పుడు పండగ` అంటూ కామెంట్ చేశాడు ఓ ఫాలోయర్. ఆ కామెంట్ చూసి నెటిజన్లు నవ్వుకొన్నారు.

ప్రేక్షకులు చాలా తెలివైనవాళ్లు. తెరపై క్యారెక్టర్లతో మాట్లాడినట్టుగా బయట పంచ్ లేస్తే అస్సలు ఒప్పుకోరు. ఎక్కడ ఎలా స్పందించాలో అలా స్పందిస్తారు. కార్తికేయ కామెంట్ చూసి `కొంచెం ఓవర్ గా లేదూ…` అన్నవాళ్లు కొంతమందైతే – `హిట్టొచ్చింది కాబట్టి చెల్లుతోంది.. ముందుంది ముసళ్ల పండగ` అన్నవాళ్లు మరికొందరు. అన్నట్టు ఈరోజే `ఆర్.ఎక్స్.100` సినిమా ఈ రోజు 25 రోజులు ఫంక్షన్ జరుపుకొంటోంది.