హీరోయిన్ ను స్కెలిటన్ అంటున్నారు

0

బాలీవుడ్ స్టార్ నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. సూపర్ హిట్ మూవీ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంకు సీక్వెల్ గా రూపొందుతున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో అనన్య పాండే హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. కరణ్ జోహార్ బ్యానర్ లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ కు జోడీగా అనన్య నటిస్తోంది. ఈమె మొదటి సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకుండానే అప్పుడే సోషల్ మీడియాలో ఈమె గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఈమె గురించి జరుగుతున్న చర్చ నెగటివ్ గా అవ్వడం విశేషం. తాజాగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంకు సంబంధించిన పాటను విడుదల చేయడం జరిగింది. ఆ పాటలోని అనన్య లుక్ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందులో అనన్య మినిమం ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేక పోతుందని కామెంట్స్ వచ్చాయి. మరి కొందరు మనిషి అన్న తర్వాత ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ లేకుండా ఉండటం కూడా గొప్ప విషయమై అంటూ అనన్య పై ట్రోల్స్ వస్తున్నాయి. ఇక అనన్య మరీ బక్కపల్చగా ఉందని ఆమె ఒంటిపై కనీసం కేజీ కండ కూడా లేదు చూడ్డానికి ఆమె స్కెలిటన్ మాదిరిగా ఉందనే విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై అనన్య ఇంకా స్పందించలేదు. ఆ విమర్శలకు తన సినిమాతోనే సమాధానం చెప్పాలని అనన్య భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Please Read Disclaimer