ఆ హీరోయిన్‌పై దాడి చేయించింది ప్ర‌ముఖ న‌టుడే

0Heroine-attackedదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ మలయాళ నటిపై దాడి కేసు కొత్త మలుపు తిరిగింది. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటుడు డబ్బులు ఇచ్చి తనతో ఈ పని చేయించాడని, అమె షెడ్యూల్‌ను ఓ ప్రముఖ దర్శకుడు తనకు అందజేశాడని కేసులో ప్రధాన నిందితుడైన‌ పల్సర్ సుని వెల్లడించాడు.

ప్రస్తుతం త్రిస్సూర్ జిల్లాలోని కక్కనాడ్ జైలులో సుని ఉన్నాడు. పోలీసుల విచారణ సందర్భంగా ఒక్క విషయమూ చెప్పని సుని.. జిన్సె అనే తోటి ఖైదీతో అన్ని వివరాలను పంచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన తన స్నేహితులను కలిసేందుకు కొచ్చి వెళ్తుండగా మార్గమధ్యంలో నటిని అపహరించి దాడి చేయాల్సిందిగా ఓ మెగాస్టార్ తనతో బేరం కుదుర్చుకున్నాడని బయటపెట్టాడు. జిన్సె ద్వారా తాజాగా తెలిసిన వివరాల ఆధారంగా న్యాయమూర్తి ఎదురుగా పల్సర్ సుని వాంగ్మూలం రికార్డు చేస్తామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. కొత్తగా తెరపైకి వచ్చిన వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తామన్నారు.

కాగా సినీన‌టీపై దాడి విష‌యంలో పోలీస్ రిపోర్ట్ క‌ల‌క‌లం సృష్టించింది. పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివ‌రాల‌ను ఓ మీడియా ప్ర‌చురించ‌గా అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.ఆ వివ‌రాల ప్ర‌కారం….హీరోయిన్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న సినిమా షూటింగ్‌ను త్రిశూర్‌కు సమీపంలో ముగించుకొని సాయంత్రం స‌మ‌యంలో చిత్ర‌నిర్మాణ సంస్థ స‌మ‌కూర్చిన వాహ‌నంలో బ‌య‌లుదేరింది. కొచ్చి సమీపంలోని పనంపిల్లీ నగర్‌లోని తన స్నేహితురాలి ఇంటికి ఆమెను తీసుకువెళుతున్న డ్రైవ‌ర్ మార్టిన్ అప్ప‌టికే కుదిరిన డీల్ మేర‌కు పల్సర్‌ సుని గ్యాంగ్ కు స‌మాచారం ఇచ్చాడు.దీంతో ప‌ల్స‌ర్ సునీ గ్యాంగ్ ఎంట‌రైంది.

క్యాటరింగ్‌ వ్యాన్‌లో సినీ న‌టిని వెంటాడి రాత్రి 8.30 గంటల సమయంలో నెదుంబసరీ ఎయిర్‌పోర్ట్‌ జంక్షన్‌లో ఢీకొట్టింది. అనంత‌రం నిందితులు కారులోకి చొర‌బ‌డి గొంతు మూసివేసి ఆమె ఫోన్‌ను లాక్కున్నారు. ఇందులో నుంచి ఓ దుండ‌గుడు దిగిపోగా మ‌రో వ్య‌క్తి కారు ఎక్కాడు. కొద్దిసేప‌టి త‌ర్వాత ప‌ల్స‌ర్ సునిల్ మాస్క్ క‌ట్టుకొని డ్రైవ‌ర్ సీటులోకి రాగా మిగ‌తా వారు క్యాట‌రింగ్ వ్యానులోకి వెళ్లారు. అనంత‌రం వాహ‌నాన్ని క‌క్క‌నాడ్ ప్రాంతానికి తీసుకువెళ్లిన ప‌ల్స‌ర్ సునీ లైంగికంగా వేధించాడు. వేరే వారి త‌ర‌ఫున తాను వ‌చ్చాన‌ని పేర్కొంటూ ఆమెను అస‌భ్యంగా చిత్రీక‌రించి ఆ తదుప‌రి కారులో నుంచి తోసేశాడు. ఇలా రెండున్న‌ర గంట‌ల పాటు ఈ దుశ్చ‌ర్య కొన‌సాగింద‌ని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నట్లు స‌ద‌రు మీడియా వివ‌రించిందని ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్రచారం అనంత‌రం ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ మీడియాతో మాట్లాడుతూ సంఘ‌ట‌న‌పై వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఆ హీరోయిన్‌పై రేప్ జ‌రిగిందంటూ వార్త‌లు వెలువ‌డుతున్నాయ‌ని అయితే అది చెడు ప్ర‌చార‌మ‌ని అన్నారు. తాను సినీ న‌టితో మాట్లాడాన‌ని, రేప్ జ‌ర‌గ‌లేద‌ని ఆమె త‌న‌కు వెల్ల‌డించింద‌ని చెప్పారు