మహేష్ మూవీలో కొత్త యాంగిల్

0తాజాగా భరత్ అనే నేను సినిమా హిట్ తో మంచి జోష్ మీదున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ పాత్రలో మహేష్ అదరగొట్టాడు. ఇంతవరకు కెరీర్ లో హీరోగా 24 సినిమాలు పూర్తిచేసి కెరీర్ లో మైలురాయి లాంటి 25వ సినిమా మొదలుపెట్టాడు.

వంశీ పైడిపల్లి డైరెక్షన్ వస్తున్న ఈ మూవీలో అభిమానుల్లో ఇప్పటి నుంచే ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో మహేష్ ఓ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే జుట్టు.. గడ్డం పెంచి కనిపిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది. ఈ మూవీ రైతులకు సంబంధించిన కథగా ఉంటుందని తెలుస్తోంది. అలాగని రైతులకు సంబంధించిన కష్టాలు.. అన్నదాతల ఆత్మహత్యలు లాంటి సీరియస్ సబ్జెక్టు కూడా కాదట. ఇది రైతుల జీవితాన్ని ప్రతిబింబిస్తూనే వారి గొప్పతనాన్ని – హుందాతనాన్ని తెలియజేసే విధంగా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ యాంగిల్ కథలో మహేష్ ఇంతవరకు నటించకపోవడం ప్లస్సవుతుందని అంటున్నారు.

మహేష్ 25వ మూవీని ముగ్గురు టాప్ ప్రొడ్యూసర్లు కలిసి నిర్మిస్తున్నారు. దిల్ రాజు – అశ్వనీదత్ – పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. కామెడీ హీరో అల్లరి నరేష్ ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు. టాలీవుడ్ ట్రెండింగ్ బ్యూటీ పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.