అరవింద ఫ్యాక్షన్ లో ఆ యాంగిల్

0

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. మరో పదిరోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్.. ట్రైలర్లు.. సాంగ్స్ అన్నీ రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యాన్ని చూపించాయి కాబట్టి ఈసారి త్రివిక్రమ్ ఎలాంటి సినిమాతో రానున్నాడో అనే విషయంలో ప్రేక్షకులు ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

సీమ హింసతో పాటు భారీ ఎమోషనల్ సీన్స్ తో సినిమా తెరకెక్కిందని అర్థమయింది. కానీ ఈ సినిమాలో ఒక స్పెషాలిటీ ఉందట. ఇప్పటివరకూ మనం చూసిన ఫ్యాక్షన్ సినిమాలన్నీ ఒక ఎత్తైతే ఇది మరో ఎత్తట. అన్నీ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమాల లాగానే దీనిలో కూడా విపరీతమైన హింస ఉంటుంది. కానీ తేడా ఏంటంటే.. ఈ సినిమా సీమలో ఉన్న స్త్రీల దృష్టికోణం లో సాగుతుందట. అంటే.. హింస వల్ల భర్తను.. సోదరులను.. పిల్లలను పోగొట్టుకున్న మహిళల ఎమోషన్స్ కు ఇందులో పెద్ద పీట వేయడం జరిగిందట. ఇక ఎమోషనల్ సీన్స్ లో తారక్ యాక్టింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కాబట్టి ఇక మనం తారక్ నట విశ్వరూపం చూసేందుకు మానసికంగా రెడీ కావొచ్చు.

పూజా హెగ్డే.. ఈషా రెబ్బా హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక హాసినీ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయట.. ఆలస్యమెందుకు.. చూసే ప్లాన్ ఉంటే బుక్ చేసుకోండి.
Please Read Disclaimer