కొత్త పోరి క‌నిపిస్తే ఒట్టు…ఆ హీరో ఆగ‌డు

0nithinnనైజాం హీరో నితిన్ కు ముందు నుంచి ఓ బ్యాడ్ హాబిట్ ఉంది.త‌న ఇలాఖాలోకి ఎవ‌రైనా కొత్త బ్యూటీ ఎంట్రీ ఇస్తే చాలు…ఆమెతో ఎలాగైనా స‌రే త‌నకు జ‌త‌గా స్క్రీన్ షేర్ చేయించేస్తాడు. ఇది ముందునుంచి అలావాటుగా వ‌స్తున్న‌దే. జెనీలియా,కాజ‌ల్ ,త్రిష‌తో పాటు హ‌న్సిక‌,ఇలియానాల‌ను కూడా వ‌ద‌ల్లేదు. ఆ టైమ్లో నితిన్ ఫామ్ లో లేక‌పోయినా స‌రే ఇత‌ని ప‌క్క‌న ఆటైమ్లో ఎవ‌రైతే లీడింగ్ అప్స‌ర‌స ఉన్నారో ఆమె న‌టించాల్సిందే.

తాజాగా నితిన్…. హ‌ను రాఘ‌వ పూడి డైరెక్ష‌న్లో లై చిత్రంలో న‌టిస్తోన్న విష‌యం మ‌న‌కు తెలిసిందే.ఇందుల్లో నితిన్ కు జ‌త‌గా మేఘా ఆకాష్ న‌టిస్తోంది. ఈవిడ‌గారు చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టి కూడా రిలీజ్ కాలేదు. కాని ధ‌నుష్ ,రామ్ ల‌తో న‌టిస్తూ అప్పుడే మంచి క్రేజ్ ను తెచ్చేసుకున్నారు.అందుకే నితిన్ మేఘా ఆకాష్ ను త‌న‌కు జ‌త‌గా చేసుకున్నాడు.

ఇది చాల‌ద‌న్న‌ట్లు కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాధ ఫేం మెహ్రీన్ పై కూడా మ‌న నితిన్ క‌న్ను ప‌డింది. వ‌న్స్ క‌న్ను ప‌డ్డాక వ‌దులుతాడా చెప్పండి… ర‌వితేజకు ఇచ్చిన కాల్షీట్స్ ఏంటో తెలుసుకుని అత‌ని త‌ర్వాత డేట్స్ త‌న‌కు ఎడ్జెస్ట్ చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌.ఈసినిమాను ప‌వ‌న్ ,త్రివిక్ర‌మ్ లు నిర్మిస్తున్నారు.దీనికి డైరెక్ట‌ర్ కృష్ణ చైత‌న్య వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.మొత్తానిక నితిన్ టాలీవుడ్ మార్కెట్లోకొచ్చే ఈ కొత్త పోరిని వ‌ద‌ల‌డం లేదు.మ‌నోడి అది భాగా క‌లిసొచ్చింద‌నుకుంట‌.