ఎయిర్‌టెల్‌ లో మరో కొత్త ఆఫర్

0airtel-jioటెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో కొత్తకొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్య జియో రూ. 98తో ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఇందుకు పోటీగా ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ కూడా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇందులో భాగంగానే రూ. 93తో 1జీబీ డేటా అంటూ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ. 93తో రీఛార్జ్‌ చేసుకుంటే 10 రోజుల వ్యాలిడిటీతో 1జీబీ డేటా అందిస్తుంది. దీంతో పాటు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఇస్తుంది. జియో కూడా రూ. 98కి 14 రోజుల వ్యాలిడిటీతో 2.1జీబీ డేటా అందిస్తోంది. అయితే జియోలో రోజుకు 0.15జీబీ డేటా పరిమితి ఉండగా.. ఎయిర్‌టెల్‌లో ఎలాంటి పరిమితులు లేవు.

తక్కువ వ్యాలిడిటీలో డేటా ఆఫర్లు కావాలనుకునే వినియోగదారుల కోసం ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. మరోవైపు టెలికాం సంస్థ వొడాఫోన్‌ కూడా తక్కువ వ్యాలిడిటీతో ప్రీపెయిడ్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. రూ. 46కే ఏడు రోజుల వ్యాలిడిటీటో 500 ఎంబీ 4జీ డేటా అందిస్తోంది.