తెలంగాణలో మరో కొత్త పార్టీ

0తెలంగాణలో మరో కొత్త పార్టీ. ఇటీవలే ఈ కొత్త పార్టీని ఏర్పాటును జెఏసి ఛైర్మన్‌ కోదండరాం ప్రకటించిన సంగతి తెలిసిందనే. రాజకీయ పార్టీ పెట్టాలని వస్తున్న డిమాండ్‌ను సమ్మతిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోదండరాం వెల్లడించారు. కాగా ఇప్పుడు మరో కొత్త పార్టీ ప్రటకటన వచ్చింది.

జస్టిస్‌ చంద్రకుమార్‌ నాయకత్వంలో ‘తెలంగాణ ప్రజల పార్టీ’ పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కొత్త పార్టీని ప్రకటించడంతో పాటు జెండా ఆవిష్కరించారు. అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో అందరికీ సమానావకాశాలు కల్పించడం కోసం, కులవివక్ష నిర్మూలన, నిరుపేదలందరికీ ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం తమ పార్టీ ఆశయాలని చంద్రకుమార్‌ వ్యాఖ్యానించారు.