బిగ్ బాస్ మసాలా.. నాని ఏమంటాడో..

0రియాలిటీ షోల రారాజు బిగ్ బాస్ కాలం గడుస్తున్నా కొద్దీ మరింత ఘాటు తనాన్ని రప్పిస్తోంది. ఈ సారి ఇంకొంచెం మసాలా అంటూ నాని ఎలా అన్నాడో గాని నిజగానే షోలో డోస్ ఎక్కువవుతోంది. కోలీవుడ్ లో అయితే ఇప్పటికే కమల్ షో ఊహించని రేంజ్ లో ముందుకు సాగుతోంది. అందులో అమ్మాయిలు ఏకంగా లిప్ లాక్ లతో మునిగి తేలడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగులో అయితే ఇంకా ఆ రేంజ్ కి వెళ్ళలేదు.

కానీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నడుస్తోందని ఓ టాక్ ఇప్పటికే వైరల్ అవుతోంది. హౌస్ లో కూడా అలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తేజస్విని – సామ్రాట్ మధ్యన కెమిస్ట్రీ వర్కౌట్ అవుతోంది అని హౌస్ లో గుసగుసలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్ గా నందిని రాయ్ అనే కంటెస్టెంట్ ఒకసారి ఇద్దరి మధ్య ఎదో నడుస్తోంది అనడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. అయితే తేజస్విని మాత్రం ఆ వార్తలను కొట్టి పారేసింది. ఇద్దరి మధ్య ఏమి లేదు అని డిఫెరెంట్ గా సమాధానం ఇవ్వడంతో అందరి ద్రుష్టి వారిపై మళ్లింది.

ముందుగా నాని చెప్పినట్టు మరింత మసాలా అనే దానికి అసలైన అర్ధం ఇప్పుడిపుడే అర్థమవుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ప్రేమాయణం అసలు ఉందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు నాని కూడా ఏదన్నా ప్రశ్నిస్తాడా అనేదే చూడాల్సిని విషయం. ఇక షో నుంచి ఈ ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా ఆసక్తిగా మారింది.