ఎన్టీఆర్ కు బుల్లితెర విలన్

0


ronith-royఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న మొదటి సినిమా జై లవకుశ. ఇప్పుడీ సినిమాలో విలన్ ఫిక్సయ్యాడు. ఇందులో విలన్‌గా బుల్లితెర హిందీ నటుడు రోనిత్‌ రాయ్‌ను చిత్ర బృందం ఎంపిక చేసింది.తాజాగా ‘జై లవకుశ’ చిత్ర బృందాన్ని కలిసిన ఆయన అనంతరం షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఇందులో విలన్‌గా తొలుత కన్నడ నటుడు దునియా విజయ్‌ని ఎంపిక చేయాలని భావించినా, ఆ పాత్రకు రోనిత్‌ అయితే సరిగ్గా సరిపోతారని ఆయన్ని ఎంపిక చేశారు. చిత్రానికి బాబీ దర్శకుడు. ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్స్ మరింత అంచనాలను పెంచుతున్నాయి.