ఊహించని జవాబుతో ట్విస్ట్ ఇచ్చిన భామ!

0గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న బోలెడంత మంది బ్యూటీల్లో నియా శర్మ ఒకరు. ఈ భామ ఇప్పటికే టీవీ ద్వారా హిందీ ఆడియన్స్ లో మంచి పాపులారిటీ సాధించింది. బుల్లి తెరలో క్యూటుగా కనిపించి అందరినీ మెప్పించిన ఈ బ్యూటీ తర్వాత బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ తెరకెక్కించిన ‘ట్విస్టెడ్’ అనే వెబ్ సీరస్ తో ఘాటుగా అందాలను ధారపోసి యూత్ కి గాలమేసింది.

అంతే కాదు ఒక సర్వేలో ‘ఆసియా ఖండంలో థర్డ్ హాటెస్ట్ గర్ల్’ అనే ట్యాగ్ ను కూడా సాధించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ కి 2 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారంటే మీరు ఆమె టాలెంట్ అర్థంచేసుకోవచ్చు. రీసెంట్ గా ఇన్స్టా గ్రామ్ లో ఒక ఫాలోయర్ నియాను ఒక ప్రశ్న అడిగాడు. “మీరు చాలా సెక్సీగా ఉన్నారు మరి సింగిల్ గా ఎందుకున్నారు..?” దీనికి “నేను సింగిల్ గా ఉన్నానని మీకు ఎవరు చెప్పారు?” అని తిరిగి ప్రశ్నించింది. పాపం నియాకు సంబంధించిన అఫైర్ గాసిప్స్ ఏవీ మీడియా లో రాలేదు కాబట్టి ‘నియా ఈజ్ సింగిల్’ అనుకున్నాడేమో.

నియా ఇచ్చిన షాక్ తో ఈ హాటు బ్యూటీతో రొమాన్స్ చేస్తున్న ఆ అందగాడు ఎవరా అని గూగుల్ లో వెతకడం మొదలుపెట్టారు ఆమె ఫాలోయర్లు. ఇంకా ఆ సుందరాంగుడి డీటైల్స్ బయటకు రాలేదు కానీ వచ్చే దాకా వీళ్ళకు నిద్ర ఉండదేమో! ఏదేమైనా నియా న్యూ జెనరేషన్ నెటిజెన్స్ కు మంచి టాస్కే ఇచ్చింది.