అయ్య బాబోయ్.. మీసాలొద్దు నిక్కు!

0గెటప్పులు మార్చడం అందరికి సెట్టయ్యే విషయం కాదు. అన్ని గెటప్పులు అందరికీ సూట్ కావు. కమల్ హాసన్.. విక్రమ్.. సూర్య లాంటి వాళ్ళను తీసుకోండి వాళ్ళు ఏ గెటప్ వేసుకున్న బాగానే ఉంటారు. అమీర్ ఖాన్ కూడా అంతే. కానీ ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకోబోయే అమెరికన్ ప్రియుడు నిక్ జోనాస్ అమీర్ ఖాన్ కాదు కదా అన్నీ గెటప్ లు సూట్ అయ్యేదానికి?

తాజాగా నిక్ మీసాలు పెంచి గెడ్డం నున్నగా చేసుకొని కొత్త గెటప్ లో లాస్ ఎంజెలెస్ లో కనిపించాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వెంటనే వైరల్ అయ్యాయి. ఇక నెటిజనులు ముక్త కంఠంతో ఇచ్చిన ఒకే సలహా.. “నిక్ మీసాలు తీసేయ్.. చూడలేక చస్తున్నాం.” ఒకరు “ముస్టాచ్ మ్యాన్.. గెటప్ ఈజ్ వెరీ బ్యాడ్” అంటే మరొకరు “డిచ్ దట్ ముస్టాచ్ ఇమీడియట్లీ” అని ట్విట్టర్ ద్వారా మొత్తుకుంటున్నారు.

నిజమే అన్నీ గెటప్ లు అందరికీ సెట్ కావు. మరి నిక్కుకు ఈ విషయాన్ని ప్రియాంక చెప్తుందో లేదో. ఈ గెటప్పుల సంగతేమోగానీ నిక్ – పీసీ లు నవంబర్ లో పెళ్లి చేసుకుని ఒకింటి వాళ్ళు అవుతారట. మరి ఈ గెటప్ ఒక్కదానితో అపుతాడా లేదా దశావతారం కమల్ లా ఏదైనా మిషన్ టెన్ గెటప్స్ అని ప్లాన్ చేసుకున్నాడో ఏమో!