సవ్యసాచి బ్యూటీ తగ్గట్లేదు

0బాలీవుడ్ భామల ఈ మధ్య కాలంలో హల్ చల్ చేస్తున్న విధానం మాములుగా లేదు. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వారి ఫొటోలే వైరల్ అవుతున్నాయి. సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా అందరూ చాలా వినూత్నంగా ఫొటో షూట్స్ ఇస్తూ కుర్రకారు మైండ్ ను వారివైపు తిప్పుకుంటున్నారు. గత కొంత కాలంగా నిధి అగర్వాల్ కూడా అందరిని ఎక్కువగా ఆకర్షిస్తోంది.

గత ఏడాది మున్నా మైకేల్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మంచి అవకాశాలు వస్తే ఏ ఇండస్ట్రీలో అయినా నటిస్తా అని రెండవ సినిమాకే చెప్పేసింది. ప్రస్తుతం నాగ చైతన్యతో సవ్యసాచి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇకపోతే అమ్మడు ఇచ్చే ఫొటో షూట్స్ ఆ సినిమాకు కొంచెం క్రేజ్ పెంచుతున్నాయనే చెప్పాలి. రీసెంట్ గా ఇచ్చిన ఒక స్టిల్ లో అయితే నిధి కనిపించిన తీరు అందరిని ఆకట్టుకుంది.

అమ్మడు క్లివేజ్ అందాలను ప్రజెంట్ చేసినప్పటికీ ఎక్కువ వల్గర్ గా కాకుండా చేసుకుంటోంది. హాట్ కనిపిస్తూనే అందులో అందానికి సరైన నిర్వచనాన్ని ఇస్తోంది. పాతికేళ్లు కూడా లేని ఈ బ్యూటీని చూస్తుంటే ముందు ముందు బాలీవుడ్ హీరోయిన్స్ కి గట్టి పోటీని ఇచ్చేలా ఉందని అర్ధమవుతోంది. సవ్యా సాచి సినిమాతో పాటు వెంకీ అట్లూరి – అఖిల్ సినిమాలో కూడా నిధి నటిస్తోంది.