ఐస్మార్ట్ సుందరి వల్లే ఆలస్యం?

0

పూరి జగన్నాధ్ రామ్ ల ఫస్ట్ టైం కాంబోలో రూపొందుతున్న ఐస్మార్ట్ శంకర్ అనుకున్నట్టుగానే ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికి అనుకోని అవాంతరాలు తప్పడం లేదు. తాజాగా హీరొయిన్ నిధి అగర్వాల్ పాస్ పోర్ట్ మిస్ కావడంతో యూరోప్ వెళ్ళాల్సిన టీం విజిట్ వాయిదా పడినట్టు సమాచారం. పాస్ పోర్ట్ కనిపించడం లేదని కొత్తది అప్లై చేసుకునేందుకు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది.

విచారణలో పోయిన పాస్ పోర్ట్ దొరికే అవకాశం లేదని తేలినప్పుడు అది బ్లాక్ చేయించుకుని కొత్తది తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే ఇదంతా ఒకటి రెండు రోజుల్లో అయ్యే పని కాదు. కొంత టైం పడుతుంది. అందుకే మే 9 నుంచి స్టార్ట్ అయ్యే హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత ఐస్మార్ట్ శంకర్ యూరోప్ వెళ్ళేలా ప్లాన్ ను మార్చుకున్నట్టు తెలిసింది

మే లేదా జూన్ లో విడుదల చేయాలన్న పూరి టార్గెట్ మిస్ అయ్యేలా కనిపిస్తోంది. షూట్ పూర్తయ్యాక కనీసం నెల రోజులు ప్రమోషన్ కోసం ప్లాన్ చేసుకున్న పూరి టీం మార్పు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూరి చాలా గ్యాప్ తర్వాత మణిశర్మ సంగీతం చేస్తున్న మూవీ ఇది. నభ నటేష్ మరో హీరొయిన్ గా నటిస్తోంది.

వేగంగా సినిమాలు తీసే అలవాటు ఉన్న పూరి ఇప్పుడీ అవాంతరం చికాకు పెట్టేలా ఉన్నా టైం వేస్ట్ కాకుండా హైదరాబాద్ పార్ట్ తో పాటు మరో పాటను తీసే ఆలోచన ఉందట. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాస్ పోర్ట్ పోతే సీన్ మార్చి ఏదోలా తీసుకోవచ్చు కాని అసలైన హీరొయిన్ దే పోతే ఇంత కన్నా ఏం చేయగలరు
Please Read Disclaimer